OG Movie: ఓజీ గురించి పుకార్లు హల్‍చల్: క్లారిటీ ఇచ్చిన మూవీ టీమ్

Best Web Hosting Provider In India 2024

Pawan Kalyan OG Movie: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ సినిమాపై హైప్ మామూలుగా లేదు. గ్యాంగ్‍స్టర్స్ బ్యాక్‍డ్రాప్‍లో పవర్ ఫుల్ యాక్షన్ సినిమాగా ఇది రానుంది. సాహో ఫేమ్ సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్‌తో ఓజీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీలో నటిస్తున్న కొందరి కామెంట్లు కూడా హైప్‍ను మరింత పెంచేస్తున్నాయి. అయితే, పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ‘ఓజీ’ షూటింగ్ ముందుకు సాగడం లేదు.

 

ట్రెండింగ్ వార్తలు

ఓజీ చిత్రం ఆలస్యమవుతున్న నేపథ్యంలో కొంతకాలంగా ఓ రూమర్ విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఓజీ చిత్రాన్ని నిర్మిస్తున్న ప్రొడక్షన్ బ్యానర్ మారనుందంటూ పుకార్లు వచ్చాయి. డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్ నుంచి ఓజీ సినిమా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ చేతికి వెళ్లనుందంటూ రూమర్స్ హల్‍చల్ చేస్తున్నాయి. ఇవి మరింత ఎక్కువ కావడంతో డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్ క్లారిటీ ఇచ్చింది.

ఓజీ చిత్రం తమదే అని, ఎప్పటికే తమదే అని డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్ నేడు ట్వీట్ చేసింది. “ఓజీ మాదే. ఓజీ ఎప్పటికే మాదే. పవన్ కల్యాణ్ సినిమా ఎలా ఉండబోతోందో మాకు పూర్తిగా క్లారిటీ ఉంది. మేం ఆ విధంగా ముందుకు వెళుతున్నాం. ఆయనకు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాం” అని డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్ ట్వీట్ చేసింది. మొత్తంగా ఓజీ చిత్రానికి వేరే ప్రొడక్షన్ బ్యానర్‌కు ఇస్తున్నారన్న పుకార్లను ఖండించింది.

షూటింగ్ ఆలస్యమవుతున్న కారణంగా ఓజీ సినిమాపై నిర్మాత డీవీవీ దానయ్య అసంతృప్తిగా ఉన్నారని ఇటీవల పుకార్లు వచ్చాయి. అలాగే, పవన్ కల్యాణ్‍ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ కలిశారని, ఓజీ చేతులు మారనుందనే రూమర్స్ వచ్చాయి. అయితే, ఈ రూమర్లు అవాస్తవమని ఇప్పుడు డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్ స్పష్టం చేసేసింది. తమ వద్దే ఓజీ ఎప్పుడూ ఉంటుందని క్లారిటీ ఇచ్చేసింది.

 

ఓజీ సినిమా 1950ల బ్యాక్‍డ్రాప్‍లో ముంబైలో గ్యాంగ్‍స్టర్స్ డ్రామాగా ఉంటుందని సమాచారం బయటికి వచ్చింది. జపనీస్ ఎలిమెంట్స్ కూడా ఈ చిత్రంలో ఉంటాయని పోస్టర్ ద్వారా తెలుస్తోంది. ఓజీ చిత్రంలో పవర్ ఫుల్ గ్యాంగ్‍స్టర్‌గా పవన్ కల్యాణ్ నటిస్తున్నారు. గ్లింప్స్‌లో పవర్ స్టార్ యాక్షన్, స్వాగ్ అభిమానులను తెగ ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా రేంజ్‍లో ఈ మూవీని డైరెక్టర్ సుజీత్ రూపొందిస్తున్నారు.

ఓజీ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్, వెంకట్ శ్రీయారెడ్డి, ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. సుమారు రూ.200కోట్ల బడ్జెట్‍తో ఓజీ సినిమా తెరకెక్కనుందని అంచనా. ఈ ఏడాదే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తోంది.

ఓజీ ట్రెండ్ సెట్టర్

ఓజీ సినిమా టాలీవుడ్‍లో ఓ ట్రెండ్ సెట్టర్ అవుతుందని ఈ చిత్రంలో కీరోల్ చేస్తున్న వెంకట్ ఇటీవలే ఓ ప్రైవేట్ కార్యక్రమంలో చెప్పారు. పవర్ స్టార్ అభిమానులకు ఈ మూవీ ఫుల్ మీల్స్‌లా ఉంటుందని అన్నారు. సుజీత్ అద్భుతమైన డైరెక్టర్ అని, స్టార్లు చాలా మంది ఈ చిత్రంలో నటిస్తున్నారని వెంకట్ చెప్పారు. ఈ చిత్రంపై హైప్ మరింత పెంచారు. అలాగే, ఓజీ చిత్రం ఊహలకు మించి అద్భుతంగా ఉంటుందని శ్రీయారెడ్డి కూడా గతంలో ఓ సందర్భంలో చెప్పారు.

 
WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024