Hyderabad Crime : కేపీహెచ్బీ ఫోరమ్ మాల్ వద్ద కారు బీభత్సం, మద్యం మత్తులో మాజీ మంత్రి మేనల్లుడు హల్చల్

Best Web Hosting Provider In India 2024

Hyderabad Crime : హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీ ఫోరమ్ మాల్ సర్కిల్ లో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు అగ్రజ్ రెడ్డి ఆదివారం అర్ధరాత్రి మద్యం మత్తులో కారుతో హల్చల్ చేశాడు. రాంగ్ రూట్ లో కారును అతివేగంగా నడుపుతూ మరో కారుతో పాటు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో ముగ్గురి వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. మరో కారులో ఉన్న వ్యక్తికి స్వల్పంగా గాయాలు కాగా ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరి వ్యక్తుల్లో ఒకరికి కుడి చేయి ఫ్రాక్చర్ కాగా మరో వ్యక్తి తలకు బలమైన గాయమైంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేపీహెచ్బీ పోలీసులు అగ్రజ్ రెడ్డితో పాటు అతడి స్నేహితులు తేజ్, కార్తిక్ లపై కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గచ్చిబౌలి లోని ఓ పబ్ లో పార్టీని ముగించుకొని వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు అగ్రజ్ రెడ్డికి బ్రీత్ అనలైజర్ పరీక్ష చేయగా మోతాదుకు మించి అతడు మద్యం సేవించినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రమాదంలో గాయపడిన వారు రాజస్థాన్ కు చెందిన కార్మికులు దూర్ చాంద్, బాన్వర్ లాల్ గా పోలీసులు గుర్తించారు.

 

ట్రెండింగ్ వార్తలు

16 ఏళ్ళ బాలికపై 60 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం

హైదరాబాద్ ఉప్పల్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉప్పల్ కు చెందిన బాలిక (16), స్థానికంగా ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. పాతబస్తీకి చెందిన షేక్ సాదక్ (60) అదే ఉప్పల్ బస్టాండ్ సమీపంలోని ఒక కట్టెల షాప్ లో పనిచేస్తున్నాడు. ఈ నెల 3న ఉప్పల్ లో బస్సు ఎక్కేందుకు బాలిక బస్టాండ్ వద్ద నిలుచుంది. షేక్ సాధక్ బాలికకు తెలిసిన వాడి లాగా అమ్మాయి దగ్గరికి వెళ్లి…… మీ అమ్మానాన్నలు నాకు తెలుసు అంటూ బాలికను నమ్మించాడు. ఇంటికి వెళదామంటూ ఉప్పల్ బస్టాండ్ నుంచి బాలికను బయటకు తీసుకెళ్లాడు. అక్కడ నుంచి కొంత దూరంలో నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి….బాలికపై అత్యాచారం చేసి అక్కడే వదిలేసి పారిపోయాడు. బాలిక ఇంటికి ఆలస్యంగా రావడంతో పాటు ఇంట్లో కూడా ముభావంగా ఉండడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. దీంతో బాలికను గట్టిగా నిలదీయడంతో జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పింది.

ఈ విషయంపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఉప్పల్ పోలీసులు.. సీసీ కెమెరాలు ఆధారంగా అత్యాచారానికి పాల్పడ్డ షేక్ సాదక్ గుర్తించి అరెస్ట్ చేశారు. పాఠశాలలకు వెళ్లే ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా ఎక్కడికీ వెళ్లొద్దని తెలియని వ్యక్తులు వెంట వెళ్లొద్దని పోలీసులు సూచించారు. ఏదైనా అనుమానం ఉంటే తల్లిదండ్రులకు వెంటనే సమాచారం ఇవ్వాలని లేదంటే డయల్ 100 కు కాల్ చేయాలని పోలీసు సూచిస్తున్నారు.

 

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

WhatsApp channel
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024