Best Web Hosting Provider In India 2024
Aarya Antim Vaar OTT Release Date: బాలీవుడ్ నటి సుష్మితా సేన్ ప్రధాన పాత్ర పోషించిన ‘ఆర్య’ వెబ్ సిరీస్ చాలా పాపులర్ అయింది. క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ సిరీస్‍కు మంచి ఆదరణ దక్కింది. డిస్నీ+ హాట్‍స్టార్‌లో ఇప్పటి వరకు ఆర్య వెబ్ సిరీస్ మూడు సీజన్లు వచ్చాయి. నాలుగో సీజన్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఆర్య సిరీస్‍లో చివరిదైన నాలుగో సీజన్‍పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ‘ఆర్య – అంతిమ్ వార్’ సీజన్ ఎప్పుడు స్ట్రీమింగ్‍కు రానుందో డిస్నీ+ హాట్‍స్టార్ వెల్లడించింది.
ట్రెండింగ్ వార్తలు
‘ఆర్య – అంతిమ్ వార్’ సీజన్ డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఫిబ్రవరి 9వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని హాట్‍స్టార్ అధికారికంగా ప్రకటించింది. “ఆఖరి శ్వాస తీసుకునే ముందు.. చివరిసారి ఆమె పంజా విసురుతుంది” అంటూ ఇన్‍స్టాగ్రామ్‍లో క్యాప్షన్ రాసుకొచ్చింది. అలాగే.. ఓ వీడియో గ్లింప్స్ కూడా పోస్ట్ చేసింది.
ఈ గ్లింప్స్ మొదట్లో సుష్మితా సేన్‍కు బుల్లెట్ తగిలినట్టుగా ఉంది. ఆ తర్వాత ఆమె డైలాగ్ ఉంది. “ఆఖరి శ్వాస తీసుకునేలోగా.. నా పంజా కచ్చితంగా విసురుతా” అని డైలాగ్ ఉంది. ఈ టీజర్లో ఫుల్ యాక్షన్ మోడ్‍లో సుష్మిత కనిపించారు. కత్తులతో, గన్‍తో కనిపించారు. ముగింపు మొదలవుతుంది అంటూ టీజర్ చివర్లో ఉంది. ఫిబ్రవరి 9న డిస్నీ+ హాట్‍స్టార్‌లో ఈ ఆర్య సిరీస్ నాలుగో సీజన్ అంతిమ్ వార్’ స్ట్రీమింగ్‍కు రానుంది.
క్రైమ్ థ్రిల్లర్ ఆర్య వెబ్ సిరీస్‍ను రామ్ మధ్వానీ క్రియేట్ చేశారు. ఇప్పటి వరకు మూడు సీజన్లు వచ్చాయి. సుష్మితా సేన్‍తో పాటు ఐలా అరుణ్, సికిందర్ ఖేర్, చంద్రచూడ్ సింగ్, ఇంద్రనీల్ సెంగుప్త, వికాస్ కుమార్, మాయా సరావ్, గీతాంజలి కులకర్ణి, శ్వేత పస్రిచా, విరేన్ వజిరాణి, ప్రత్యక్ష్ పన్వర్, ఆరుషి బజాజ్ ఈ సిరీస్‍లో కీలకపాత్రలు పోషించారు. విశాల్ కరుణ్ ఈ సిరీస్‍కు సంగీతం అందిస్తున్నారు.
ఆర్య సీజన్ 2020 జూన్ 19వ తేదీన హాట్‍స్టార్ ఓటీటీలోకి వచ్చింది. 9 ఎపిసోడ్లు ఉన్న తొలి సీజన్ బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత 2021 డిసెంబర్లో రెండో సీజన్, 2023 నవంబర్‌లో మూడో సీజన్ వచ్చాయి. సుష్మితా సేన్ యాక్టింగ్, యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హైలైట్‍గా నిలిచాయి. ఇక నాలుగో సీజన్ అంతిమ్ వార్ ఈ ఏడాది ఫిబ్రవరి 9న రానుంది.
ఆర్య సిరీస్ బ్యాక్‍డ్రాప్ ఇదే..
భర్తను, పిల్లలను ప్రేమగా చూసుకునే మహిళగా ఆర్య సరీన్ (సుష్మితా సేన్) ఉంటారు. అయితే, తన భర్త చేసే అక్రమ వ్యాపారాల గురించి ఆమెకు తెలియకుండా ఉంటుంది. అయితే, ఓ దశలో ఆర్య భర్త హత్యకు గురవుతాడు. డ్రగ్ మాఫియా నుంచి ఆర్యకు, ఆమె పిల్లలకు కూడా ప్రమాదం ఉంటుంది. వారిని కూడా మాఫియా చంపాలని చూస్తుంది. దీనికి బదులుగా ఆర్య కూడా ఓ గ్యాంగ్‍లో చేరతారు. తన భర్తను చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని, తన పిల్లలను కాపాడుకోవాలనే క్రమంలో ఆర్య కూడా మాఫియా క్వీన్‍గా ఎదుగుతారు. అలాగే తన ముగ్గురు పిల్లలను కూడా జాగ్రత్త చూసుకుంటుంటారు. తన పగ తీర్చుకునే ప్రయాణంలో చివరగా ఏం జరిగిందనేది ‘అంతిమ్ వార్’ సీజన్‍లో మేకర్స్ చూపించనున్నారు.