Best Web Hosting Provider In India 2024
Dil Raju: ఈసారి సంక్రాంతి సీజన్‍కు టాలీవుడ్‍లో పోటీ విపరీతంగా ఉంది. జనవరి 12వ తేదీన భారీ అంచనాలు ఉన్న మహేశ్ బాబు ‘గుంటూరు కారం’, అదే రోజున తేజ సజ్జా సూపర్ హీరో మూవీ ‘హనుమాన్’ విడుదల కానున్నాయి. వెంకటేశ్ యాక్షన్ మూవీ ‘సైంధవ్’ జనవరి 13న, నాగార్జున ‘నా సామిరంగా’ జనవరి 14న రానున్నాయి. దీంతో పోటీ తీవ్రంగా ఉంది. సినిమాలకు థియేటర్ల పంపకాలు కష్టంగా మారింది. ఈ తరుణంలో హనుమాన్ సినిమా రిలీజ్‍ను ఆపాలని ప్రముఖ నిర్మాత దిల్‍రాజ్ ప్రయత్నించాలని పుకార్లు వచ్చాయి. ఈ విషయంపై దిల్‍రాజు తాజాగా స్పందించారు.
ట్రెండింగ్ వార్తలు
దిల్‍రాజు ఏమీ స్పందించరని.. కొందరు ఏది పడితే అది రాస్తున్నారని, అయితే ఇప్పటి నుంచి తాను ఊరుకొనని.. తాటతీస్తా అంటూ దిల్‍రాజు వార్నింగ్ ఇచ్చారు. ఓ సినిమా ఈవెంట్‍కు నేడు హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “దిల్‍రాజ్ ఏమీ స్పందించరని అనుకుంటున్నారా.. తాట తీస్తా. చాలా రోజుల నుంచి ఓపిక పడుతున్నా. ఆ నిర్మాత (హనుమాన్ సినిమా) ఏమైనా మాట్లాడారా. ఎందుకు ప్రతీ సంక్రాంతికి నన్నే టార్గెట్ చేయాలి. ఇంతమంది నన్నుఅభిమానిస్తున్నారు కదా. 95 శాతం మంది ఇష్టపడతారు. 5 శాతం మంది ఇష్టపడకపోవచ్చు. అందరినీ సాటిసిఫై చేయలేం. దిల్‍రాజు అంటే ఒక బ్రాండ్” అని దిల్ రాజు అన్నారు.
హనుమాన్ టీమ్‍కు ఆ సలహా ఇచ్చా
హనుమాన్ సినిమాను ఆపాలని తాను ప్రయత్నించినట్టు వచ్చిన పుకార్లు పూర్తిగా అవాస్తవమని దిల్‍రాజు చెప్పారు. జనవరి 14వ తేదీన రిలీజ్ చేస్తే థియేటర్లు ఎక్కువగా దొరికే అవకాశం ఉంటుందని మాత్రమే సలహా ఇచ్చానని అన్నారు. మూవీ ఆపాలని అసలు చెప్పలేదని, కావాలంటే ఆ మూవీ నిర్మాత, దర్శకుడితో డిబేట్ పెట్టండని దిల్‍రాజు అన్నారు.
ఆ సినిమాలకే థియేటర్లు లేవు
గుంటూరు కారం రిలీజ్ కానున్న నేపథ్యంలో నైజాంలో వెంకటేశ్ (సైంధవ్), నాగార్జున (నా సామిరంగా) సినిమాలకే థియేటర్లు కష్టంగా ఉందని దిల్‍రాజ్ చెప్పారు. ఇక హనుమాన్‍కు అడిగినన్ని థియేటర్లు ఎలా వస్తాయని ఆయన చెప్పారు.
ఈ వివాదాల వల్ల కోట్లు పెట్టినా రాని ప్రమోషన్లు హనుమాన్‍కు వచ్చేశాయని దిల్‍రాజు చెప్పారు. హనుమాన్ మూవీ హిట్ కావాలని కోరుకుంటున్న వాళ్లలో తాను ఒకడినని ఆయన స్పష్టం చేశారు. హనుమాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుందని, మిగిలిన ఎక్కడా థియేటర్ల సమస్య లేదు కదా అని చెప్పారు.
ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా తాను మీటింగ్ పెట్టి.. హీరో రవితేజను ఒప్పించి సంక్రాంతి రేసు నుంచి ఈగల్ సినిమాను విరమించుకునేలా చేశామని దిల్‍రాజు చెప్పారు. అది ఎంత కష్టమో తెలుసా అని అన్నారు.
ఆ సినిమా సంక్రాంతికి రావడం లేదు
తమిళ మూవీ అయలాన్ తెలుగు వెర్షన్ నైజాం హక్కులను దిల్‍రాజు దక్కించుకున్నారు. జనవరి 12వ తేదీనే ఈ చిత్రం రిలీజ్ కావాల్సింది. అయితే, తెలుగులో ఆరోజు రిలీజ్ కాదని, వాయిదా వేస్తున్నట్టు దిల్‍రాజు చెప్పారు. అయితే, తాను సంక్రాంతికే అయలాన్ రిలీజ్ చేస్తున్నానని కొందరు అసత్య ప్రచారం చేశారని, అయితే తెలుగులో తానే ఈ మూవీని వాయిదా వేస్తున్నారనని తెలిపారు.
హనుమాన్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో చిరంజీవి తన గురించి మంచి విషయాలు మాట్లాడితే వాటిని కూడా కొందరు వక్రీకరించారని దిల్‍రాజు ఎమోషనల్ అయ్యారు.