Food Coma : ఫుడ్ కోమా అంటే ఏంటి? ఎలా పరిష్కరించాలి?

Best Web Hosting Provider In India 2024

మధ్యాహ్నం పూట భోజనం చేశాక నిద్రపోవాలని చాలా మందికి అనిపిస్తుంది. ఎంత ట్రై చేసినా కళ్లు మూతలు పడుతుంటాయి. మీ కళ్ళు తెరిచి ఉంచకుండా ప్రయత్నించండి. కానీ ఉండలేరు. ఆవలింతలు వస్తుంటాయి. దాదాపు చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. తిన్న తర్వాత ఇలా అలసిపోవడాన్ని ఫుడ్ కోమా అని అంటారు. ఈ పరిస్థితిని పోస్ట్‌ప్రాండియల్ సొమ్నోలెన్స్ అని కూడా పిలుస్తారు.

ట్రెండింగ్ వార్తలు

ఎంత బిజీగా ఉన్నా, మనసు పనిపై పెడదామంటే అస్సలు కుదరదు. తినేసిన తర్వాత నిద్ర కమ్ముకస్తూ ఉంటుంది. తిని పనికి కూర్చుంటారు. కానీ శరీరం అస్సలు సహకరించదు. ఒక్క కునుకు వేస్తే బాగుండు అనిపిస్తుంది. దీంతో పనికి అంతరాయం కలుగుతుంది. ఫుడ్ కోమా నుంచి బయటపడేందుకు కొన్ని విషయాలను అనుసరించాలి.

బిర్యానీ, పిజ్జా, బర్గర్లు, పేస్ట్రీలు, కేకులు వంటి ఆహారపదార్థాలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులకు గురవుతాయి. అదనపు నూనెతో మసాలా లేదా కొవ్వు పదార్థాలను నివారించండి. శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్ల తీసుకోవడం తగ్గించండి. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, కార్బోనేటేడ్ శీతల పానీయాలను మధ్యాహ్నం మానుకోండి. మధ్యాహ్న సమయంలో చక్కెర, కొవ్వు ఎక్కువగా తినడం వల్ల నిద్ర వస్తుంది.

మధ్యాహ్న భోజనంలో ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులను చేర్చాలి. ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తినాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయి స్థిరంగా ఉంటుంది. ఫలితంగా మీ నిద్రలేమి మాయమవుతుంది.

ఒకేసారి ఎక్కువ ఆహారం తినవద్దు. రోజంతా తరచుగా చిన్న భోజనం చేయండి. ఆహారాన్ని నేరుగా మింగకూడదు. నెమ్మదిగా నమిలి మింగాలి. తిన్న తర్వాత ఒకే చోట కూర్చోవద్దు, నడవండి. అప్పుడే మధ్యాహ్నం వచ్చే నిద్ర మాయమవుతుంది. లేదంటే కళ్లు మూసుకుని పోతుంటాయి.

భోజనానికి ముందు, తరువాత పుష్కలంగా నీరు తాగాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అయితే భోజనం చేసిన వెంటనే కాకుండా కాసేపు ఆగి ఎక్కువ నీరు తాగడం మంచిది. భోజనం చేయడానికి ఓ గంట ముందు నీరు తాగాలి.

భోజనానికి ముందు లేదా తర్వాత కెఫిన్ కలిగిన పానీయాలు.. అదే టీ, కాఫీలు తాగకపోవడమే మంచిది. ఇది నిద్ర, జీర్ణక్రియకు భంగం కలిగిస్తుంది. నిద్ర రాకూడదని భోజనం చేసిన వెంటనే టీ తాగొద్దు. ఇది మంచి పద్ధతి కాదు. జీర్ణవ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది.

రాత్రికి ఏడెనిమిది గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి. రాత్రి బాగా నిద్రపోతే రోజంతా నిద్ర రాదు. బాగా నిద్రపోయినప్పుడు శరీరం లెప్టిన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. తిన్న తర్వాత ఈ హార్మోన్ మన కడుపు నిండిందని మన మెదడుకు చెబుతుంది. అయితే నిద్ర సరిగా లేకుంటే.. గ్రెలిన్ అనే హార్మోన్ స్రావం పెరుగుతుంది. ఫలితంగా మరింత ఆకలిగా ఉంటుంది. పైన చెప్పిన చిట్కాలు పాటిస్తే ఫుడ్ కోమా నుంచి బయటపడొచ్చు.

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024