Jabardasth Promo: డ్ర‌గ్స్ నోటీసుల‌పై జ‌బ‌ర్ధ‌స్త్‌ స్కిట్ – రాకింగ్ రాకేష్‌కు వార్నింగ్‌

Best Web Hosting Provider In India 2024

Jabardasth Promo:ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ధ‌స్థ్ లేటెస్ట్ ప్రొమో మంగ‌ళ‌వారం రిలీజైంది. ఈ ప్రోమోలో రాకింగ్ రాకేష్ స్కిట్‌లో డ్ర‌గ్స్ నోటీసుల టాపిక్ రావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ ప్రోమోలో కంటెస్టెంట్ స‌త్య‌శ్రీ అందాన్ని పొగుడుతూ డ్ర‌గ్స్ కేసులో కొంప‌దీసి నీకు ఏమైనా నోటీసులు పంపించారా అని రాకింగ్ రాకేష్ అడిగాడు. రాకింగ్ రాకేష్ మాటల‌కు స‌త్య‌శ్రీ కంగారు ప‌డుతూ లేదు అని చెప్పింది. ఎందుకు అని అడ‌గ్గా…ఇంత అందాన్ని మ‌త్తెక్కిస్తుంటే నీకు డ్ర‌గ్స్ నోటీసులు ఎందుకు ఇవ్వ‌రు అంటూ స‌త్య‌శ్రీని పొగిడాడు రాకింగ్ రాకేష్‌.

 

ట్రెండింగ్ వార్తలు

సుజాత వార్నింగ్…

స్టేజ్ కింద ఉన్న జోర్దార్ సుజాత‌…నువ్వు స్టేజైతే దిగు నీకు ఇవ్వాల్సిన నోటీసులు నేను ఇస్తా అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఆ త‌ర్వాత మామూలుగా ఏమైనా ఇవ్వొచ్చుగా అని స‌త్య‌శ్రీను రాకింగ్ రాకేష్ అడ‌గ్గానే…అత‌డిపైకి సుజాత చీపురును విస‌ర‌డం న‌వ్వుల‌ను పూయిస్తుంది. డ్ర‌గ్స్ నోటీసులు అంటూ రాకింగ్ రాకేష్ చెప్పిన డైలాగ్‌ల‌ను మ్యూట్ చేశారు. డైలాగ్‌పై విమ‌ర్శ‌లు రాకూడ‌ద‌నే మ్యూట్ చేసిన‌ట్లు స‌మాచారం.

ఇమ్మాన్యుయేల్‌ను అన్న‌య్య అన్న వ‌ర్ష‌…

ఇదే ప్రోమోలో ఇమ్మాన్యుయేల్‌ను వ‌ర్ష అన్న‌య్య అని పిలిచింది. నువ్వు చూసిన సంబంధాలు చేసుకుంటే ఈ అన్న‌య్య‌కు కోప‌మ‌స్తుంది అని ఇమ్మాన్యుయేల్‌ను చూపించి వ‌ర్ష అన్న‌ది. నువ్వు అన్న‌య్య అంటే కోప‌మొస్తుంది అంటూ వ‌ర్ష‌కు వార్నింగ్ ఇచ్చాడు ఇమ్మాన్యుయేల్.

బుల్లెట్ భాస్క‌ర్ స్కిట్‌

బుల్లెట్ భాస్క‌ర్‌, నాటీ న‌రేష్ స్కిట్ మొత్తం డ‌బుల్ మీనింగ్ డైలాగ్‌ల‌తో సాగింది. ఈ ప్రోమోలో కూడా కొన్ని డైలాగ్స్‌ను మ్యూట్ చేశారు. ఆటో రాంప్ర‌సాద్ స్కిట్ కూడా న‌వ్వుల‌ను పంచుతోంది. ఈ ప్రోమో యూట్యూబ్‌లో వైర‌ల్‌గా మారింది. అయితే ఇంత‌కు ముందు స్థాయిలో స్కిట్స్‌లో కామెడీ లేదంటూ ఈ ప్రోమోను ఉద్దేశించి జ‌బ‌ర్ద‌స్త్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ర‌ష్మి కోస‌మే…

కామెడీ కోసం కాకుండా ర‌ష్మి కోస‌మే ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ధ‌స్థ్ చూడాల్సివ‌స్తుంద‌ని ప్రోమోను అంటున్నారు. చ‌మ్మ‌క్ చంద్ర‌, సుడిగాలిసుధీర్‌, గెట‌ప్ శ్రీనుతో పాటు ప‌లువురు టాప్ కంటెస్టెంట్స్ జ‌బ‌ర్ధ‌స్థ్‌కు దూరం కావ‌డంతో షో రేటింగ్ త‌గ్గింది. 12న శుక్ర‌వారం ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ధ‌స్త్ ఫుల్ ఎపిసోడ్ రిలీజ్ కానుంది. ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ధ‌స్త్ షోకు ఖుష్బూ, కృష్ణ భ‌గ‌వాన్ జ‌డ్జిలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. జ‌బ‌ర్ధ‌స్థ్‌కు యాంక‌ర్‌గా అన‌సూయ స్థానంలో సిరి హ‌నుమంతు వ‌చ్చింది. కానీ ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ధ‌స్థ్‌కు మాత్రం ర‌ష్మి యాంక‌ర్‌గా కొన‌సాగుతోంది.

 
WhatsApp channel
 

టాపిక్

 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024