Alcohol: ఆల్కహాల్ అనేది ఆరోగ్యకరమైన పానీయం కాదు. అందుకే మానేయమని పోషకాహార నిపుణులు, వైద్యులు సూచిస్తూనే ఉంటారు. కానీ ఆ అలవాటు ఉన్నవారు ఆల్కహాల్ తాగకుండా ఉండలేరు. ఇంట్లో వారు ఆల్కహాల్ అలవాటును మానేయమని చెబుతున్నా వారు మానలేరు. ఒకవేళ నెల రోజులపాటు మీరు ఆల్కహాల్ తాగడం పూర్తిగా మానేస్తే మీలో జరిగే మార్పులు ఏంటో తెలుసుకోండి.
ట్రెండింగ్ వార్తలు
ఎన్నో మార్పులు
ఆల్కహాల్ కు దూరంగా ఉండడం వల్ల శరీరంపై కలిగే ప్రభావం రెండు వారాల్లోనే కనిపిస్తుంది. మీకు చక్కగా నిద్ర పడుతుంది. ఆల్కహాల్ వల్ల నిద్ర చక్రానికి ఆటంకం కలుగుతుంది. ఎప్పుడైతే మీరు మద్యం మానేశారో, అప్పట్నించి మీకు హాయిగా నిద్ర పడుతుంది. విశ్రాంతిగా అనిపిస్తుంది. శక్తి స్థాయిలు పెరిగినట్టు అనిపిస్తాయి. పగటిపూట ఏ పని చేసినా ఏకాగ్రత పెరిగినట్టు అనిపిస్తుంది. అలాగే ఆల్కహాల్ తాగకపోవడం వల్ల ఒక నెలలోనే బరువు తగ్గే అవకాశం ఉంది. అలాగే శరీరంలో కొవ్వు కరిగిపోతుంది.
ఆల్కహాల్ తాగకపోవడం వల్ల కాలేయం మెరుగ్గా పనిచేస్తుంది. దీని వల్ల జీర్ణవ్యవస్థ, జీవక్రియ సవ్యంగా సాగుతాయి. మీకు సమయానికి ఆకలి వేస్తుంది. మీరు ఆహారాన్ని ఆస్వాదించగలుగుతారు. కాలేయం ఆరోగ్యంగా ఉంటే శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది.
అన్నింటికన్నా మించి ఆల్కహాల్ కు దూరంగా ఉండటం వల్ల మీకు మానసిక స్పష్టత వస్తుంది. మీరు ఏం చేస్తున్నారో, మీరు ఏం చేయాలనుకుంటున్నారో అన్న విషయాలు మీ మెదడు చక్కగా ఆలోచిస్తుంది. మీ భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. మీరు తీసుకునే నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి. డిప్రెషన్, మానసిక ఆందోళన, యాంగ్జైటీ వంటి వాటికీ దూరంగా ఉంటారు. ఈ నెల రోజులు మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. పనితీరు మెరుగు పడుతుంది. నిర్ణయాలు త్వరగా తీసుకుంటారు. మీపై మీకు శ్రద్ధ పెరుగుతుంది.
ఎప్పుడైతే ఆల్కహాల్‌కు దూరంగా ఉన్నారో, సామాజికంగా కూడా మీకు విలువ పెరుగుతుంది. ఆ విలువను మీరు గుర్తిస్తారు. మద్యం మానేసిన తర్వాత ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించాలి. తాజా ఆకుకూరలు, కూరగాయలు తింటూ వ్యాయామం చేయాలి. లేకుంటే ఒకేసారి ఆల్కహాల్ మానేసినా ప్రభావాన్ని మీ మెదడు తట్టుకోలేకపోవచ్చు.
Best Web Hosting Provider In India 2024