Best Web Hosting Provider In India 2024
HanuMan Premieres Booking: తెలుగులో ఫస్ట్ సూపర్ హీరో మూవీగా వస్తున్న ‘హనుమాన్’పై అంచనాలు చాలా హై రేంజ్లో ఉన్నాయి. టీజర్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం.. ట్రైలర్‌తో నెక్స్ట్ లెెవెల్కు వెళ్లింది. సంక్రాంతికి తీవ్రమైన పోటీ ఉన్నా సరే నమ్మకంతో బరిలోకి దిగుతోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్ చిత్రంలో తేజ సజ్జా హీరోగా నటించారు. ఈ చిత్రం జనవరి 12న రిలీజ్ కానుంది. అయితే, ఇందుకు ఒక రోజు ముందే (జనవరి 11) కొన్ని సిటీల్లో సాయంత్రం పెయిడ్ ప్రీమియర్స్ షోలు వేయాలని మూవీ యూనిట్ నిర్ణయించింది. ఈ షోలకు బుకింగ్స్ మొదలవగానే టికెట్లు శరవేగంగా బుక్ అయ్యాయి.
ట్రెండింగ్ వార్తలు
హనుమాన్ చిత్రం పెయిడ్ ప్రీమియర్లకు అద్భుతమైన స్పందన వచ్చింది. టికెట్ల బుకింగ్స్ మొదలైన గంటల్లోనే ప్రీమియర్ షోస్ హౌస్ ఫుల్ అయ్యాయి. చాలా థియేటర్లలో టికెట్లు సోల్డ్ ఔట్ అయ్యాయి. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి సహా మరికొన్ని చోట్ల హనుమాన్ పెయిడ్ ప్రీమియర్లకు నేడు బుకింగ్స్ ఓపెన్ కాగా.. గంటల వ్యవధిలోనే టికెట్లన్నీ అమ్ముడయ్యాయి.
ప్రీమియర్ షోలకు వచ్చిన రెస్పాన్స్ చేస్తుంటే హనుమాన్కు ఏ రేంజ్లో హైప్ ఉందో అర్థమవుతోంది. బడ్జెట్ పరంగా చిన్న చిత్రమే అయినా అంచనాలు మాత్రం భారీ స్థాయిలో ఉన్నాయి. ప్రీమియర్స్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవటంతో అది నిరూపితమైంది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే ఇక భారీ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రీమియర్ షోల కోసం ఓపెన్ చేసిన బుకింగ్స్ త్వరగా ఫుల్ అవడంతో మరికొన్ని షోలను యాడ్ చేసే యోచనలో మూవీ టీమ్ ఉన్నట్టు తెలుస్తోంది.
హనుమాన్ సినిమా జనవరి 12న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలాయళం, మరాఠీతో పాటు ఇంగ్లిష్ సహా మరో నాలుగు విదేశీ భాషల్లో రిలీజ్ కానుంది. హిందీలో ఉత్తరాదిన చాలా థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది. హిందీపై మేకర్స్ కూడా బాగా ఫోకస్ చేశారు. హీరో తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ ముంబైలో ప్రమోషన్లను చేశారు. స్టార్ హీరో దగ్గుబాటి రానా కూడా హనుమాన్ ప్రమోషన్లలో పాల్గొని.. మూవీ టీమ్‌కు సపోర్ట్‌గా నిలిచారు.
హనుమాన్ సినిమాలో హనుమంతు అనే ప్రధాన పాత్ర చేశారు తేజ సజ్జా. హనుమంతుడి వల్ల అతీత శక్తులు పొంది.. తమ ప్రాంతానికి ముప్పు కలిగించాలనుకునే వారిపై అతడు పోరాడతారు. అంజనాద్రి అనే ప్రాంతంలో ఈ కథ జరుగుతుంది. ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్గా నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాజ్, వెన్నెల కిశోర్, రాజ్ దీపక్, సత్య ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.
ఇటీవలే హైదరాబాద్‌లో జరిగిన హనుమాన్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఆరంభంలో ఈ చిత్రానికి థియేటర్లు ఎక్కువగా దొరకకపోయినా.. కంటెంట్ బాగుంటే కచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పారు. హనుమాన్ హిట్ అవుతుందని తనకు పూర్తి నమ్మకం ఉందంటూ మూవీ టీమ్‌కు ధైర్యం చెప్పారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.