Hanuman Remuneration: హనుమాన్ బడ్జెట్ 50 కోట్లు.. తేజ సజ్జాకే అన్ని కోట్లు.. ఒక్కొక్కరి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Best Web Hosting Provider In India 2024

Teja Sajja Remuneration For Hanuman: అ! వంటి తొలి సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్‌గా నిరూపించుకున్నాడు ప్రశాంత్ వర్మ. తర్వాత కల్కి, జాంబీ రెడ్డి చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇప్పుడు ప్రశాంత్ వర్మ తెరెక్కించిన మరో క్రేజియెస్ట్ ఫిల్మ్ హనుమాన్. ఇందులో తేజ సజ్జా హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించారు. ఇక పాపులర్ యాక్టర్ వినయ్ రాయ్ విలన్‌గా అలరించేందుకు రెడీగా ఉన్నాడు.

 

ట్రెండింగ్ వార్తలు

మొదటి పోస్టర్, టీజర్ నుంచి సూపర్ క్రేజ్ అందుకుంటోన్న హనుమాన్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఏకంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు గుంటూరు కారం మూవీకి పోటీగా బరిలోకి దిగింది హనుమాన్. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న హనుమాన్ మూవీకి సుమారు రూ. 50 కోట్ల బడ్జెట్ అయిందని సమాచారం. ఈ నేపథ్యంలో హనుమాన్ నటీనటుల పారితోషికం ఎంతో ఆసక్తిగా మారింది.

తేజ సజ్జా రెమ్యునరేషన్

చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా మారాడు తేజ సజ్జా. మెగాస్టార్ చూడాలని ఉంది సినిమాలో బాల నటుడిగా రూ. 5 వేల రెమ్యునరేషన్ తీసుకున్న తేజ సజ్జా హీరోగా మారి హనుమాన్ సినిమాకు ఏకంగా రూ. 2 కోట్లు తీసుకున్నాడని టాక్ నడుస్తోంది. బాల నటుడిగా ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించిన తేజ సజ్జా ఓ బేబీలో కీ రోల్ ప్లే చేయగా.. అద్భుతం మూవీతో హీరోగా డెబ్యూ ఇచ్చాడు. ఇక హనుమాన్ సినిమాలో సూపర్ హీరోగా తేజ సజ్జా పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాడని టీజర్, ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

 

అమృత అయ్యర్ పారితోషికం

హనుమాన్ సినిమాలో బ్యూటిఫుల్ అమృత అయ్యర్ హీరోయిన్‌గా చేస్తోంది. హనుమాన్ మూవీలో మీనాక్షిగా అమృత అయ్యార్ కనువిందు చేయనుంది. ఈ సినిమా నుంచి విడుదలైన అమృత అయ్యర్ ఫస్ట్ లుక్ మొదట్లోనే అందరినీ ఆకర్షించింది. హనుమాన్ సినిమాకు అమృత అయ్యర్ అదనపు ఆకర్షణను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇక హనుమాన్ మూవీ కోసం అమృత అయ్యర్ సుమారు రూ. 1.5 కోట్ల పారితోషికం తీసుకుందని సమాచారం.

వరలక్ష్మీ శరత్ కుమార్ పారితోషికం

తమిళలో పలు సినిమాల్లో హీరోయిన్‌గా చేసి తెలుగు సినీ ఇండస్ట్రీలో విలన్‌గా కీలక పాత్రలతో సూపర్ పాపులారిటీ సంపాదించుకుంది వరలక్ష్మీ శరత్ కుమార్. క్రాక్, యశోద, వీర సింహా రెడ్డి సినిమాల్లో విలన్‌గా అదరగొట్టిన జయమ్మ (క్రాక్‌లో పాత్ర పేరు) హనుమాన్ మూవీలో కీలక పాత్ర పోషించింది. ఇందులో హనుమంతు (తేజ సజ్జా) అక్క అంజమ్మగా వరలక్ష్మీ శరత్ కుమార్ ఆకట్టుకోనుంది. ఇందుకు గాను వరలక్ష్మీ శరత్ కుమార్ రూ. 1 కోటి వరకు అందుకున్నట్లు టాక్.

వినయ్ రాయ్ రెమ్యునరేషన్

సూపర్ హీరోల సినిమాలు అంటే.. వారికి గట్టి పోటీ ఇచ్చే పవర్ ఫుల్ విలన్ ఎంతో అవసరం. అలా హనుమాన్ వంటి తెలుగు సూపర్ హీరోకు విలన్‌గా నటించాడు వినయ్ రాయ్. వాన సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన వినయ్ రాయ్ తర్వాత విలన్ అండ్ కీ రోల్స్ చేస్తున్నాడు. ఇప్పుడు హనుమాన్ మూవీలో పవర్ ఫుల్ విలన్‌ మైఖేల్‌గా నటించాడు. ఈ సినిమాకు వినయ్ రాయ్ రూ. 65 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం.

 

వెన్నెల కిశోర్ రెమ్యునరేషన్

వీరితోపాటు హనుమాన్ సినిమా కోసం రాజ్ దీపక్ శెట్టి (ఇస్మార్ట్ శంకర్ ఫేమ్) రూ. 85 లక్షలు, పాపులర్ కమెడియన్ వెన్నెల కిశోర్ రూ. 55 లక్షలు, జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను రూ. 35 లక్షలు రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. ఇలా ఒక్కొక్కరు తమ పాత్రలో కోసం పారితోషికం అందుకున్నారు. వీరిలో అందరికంటే ఎక్కువగా తేజ సజ్జా రూ. 2 కోట్లు అందుకున్నట్లు టాక్ నడుస్తోంది.

WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024