Brahmamudi January 17th Episode: దుగ్గిరాల ఇంట్లో శోభనం చిచ్చు.. పిన్నిపై అరిచిన రాజ్.. మాటలు జారిన అనామిక

Best Web Hosting Provider In India 2024

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో ఫస్ట్ నైట్ గదిలో అనామికకు కల్యాణ్ హారం ఇస్తాడు. అది చూసి చాలా బాగుందని అనామిక అంటుంది. దానికి మరి మా కావ్య వదిన సెలక్షన్ అంటే ఏమనుకున్నావ్ అని కల్యాణ్ అంటాడు. అంటే ఇది నువ్ సెలెక్ట్ చేయలేదా అని అనామిక అంటుంది. నా మట్టిబుర్రకు అంత తెలివి ఎక్కడిది అని రాజ్ అంటాడు. దాంతో ఒక్కసారిగా కోపం తెచ్చుకుంటుంది అనామిక. హారాన్ని కోపంతో పక్కన పెడుతుంది.

 

ట్రెండింగ్ వార్తలు

తనేం చేసింది

ఇప్పుడే కదా నచ్చింది అన్నావ్ అని కల్యాణ్ అంటాడు. భర్త భార్యకు ఇచ్చే గిఫ్ట్ పరాయి వాళ్లు సెలక్ట్ చేయడం నచ్చేలేదని అనామిక అంటుంది. పరాయి వాళ్లు ఎవరున్నారు. మా వదినే కదా అని కల్యాణ్ అంటే.. నువ్ మాటి మాటికి కావ్య టాపిక్ తీసుకురావడం నాకు నచ్చలేదు అని అనామిక అంటుంది. పాపం తనేం చేసిందని కల్యాణ్ అంటాడు. తను ఏం చేసిందో నాకు తెలుసు. ఆరోజు కూడా ఎవరికోసమో పూజ నుంచి వెళ్లిపోయావ్ అని అనామిక అంటుంది.

ఎవరో ఏంటీ.. అప్పు మన ఫ్రెండే కదా అని కల్యాణ్ అంటాడు. మన ఫ్రెండ్ కాదు. నీకు ఫ్రెండ్. నువ్వేమో ఫ్రెండ్‌లా చూశావ్. కానీ, తనేమో మోసం చేసి పెళ్లి చేసుకుందామనుకుందని అనామిక అంటే.. ఛ.. ఛ.. తను అలాంటిది కాదని కల్యాణ్ అంటాడు. దాంతో ఒక్కసారిగా స్టాపిట్ అని లేస్తుంది అనామిక. ఎందుకంత ఇర్రిటేట్ అవుతున్నావ్. అప్పు నా ఫ్రెండ్. తన ప్రాణాలు కాపాడటానికి వెళ్లాను. మన పెళ్లి కోసం కావ్య వదిన హెల్ప్ చేసింది. వాళ్లను మెచ్చుకోవడంలో తప్పేముంది అని కల్యాణ్ అంటాడు.

ఎలా చస్తే మనకేంటీ..

తప్పే.. ముమ్మాటికీ తప్పే.. ఇది శోభనం గది. ఇక్కడ మన గురించి మనమే మాట్లాడుకోవాలి. మంది ఎలా చస్తే మనకెందుకు అని అనామిక అంటుంది. దాంతో షాక్ అయిన కల్యాణ్. ఎలా చస్తే మనకేంటా.. ఎవరి గురించి అంటున్నావ్. నువా చాలా దారుణంగా మాట్లాడుతున్నావ్.. ఇప్పుడు ఏమైందని. నీ స్థానం నీదే.. వాళ్ల స్థానం వాళ్లదే.. నువ్ వాళ్లను ఎందుకు అంటున్నావ్ అని కల్యాణ్ అంటే.. నువ్ వాళ్లను ఎందుకు వెనకేసుకొస్తున్నావ్ అని అనామిక అంటుంది.

 

నువ్ ఎందుకు గొడవ పెద్దది చేస్తున్నావ్ అని కల్యాణ్ అంటే.. నేనా.. నేనా.. పెద్దది చేస్తుంది అని అనామిక అంటే.. అవును.. నువ్వే అని కల్యాణ్ గట్టిగా అరుస్తాడు. మొదటిసారి కల్యాణ్ ఇలా కోప్పడతాడు. గదిలోనుంచి వచ్చినప్పటి నుంచి ఓపికగా ఉంటున్నాను. కానీ, రెచ్చగొడుతున్నావ్ అని కల్యాణ్ అంటాడు. దాంతో ఇంత జరిగాక శోభనం వద్దని వెళ్లిపోతుంది అనామిక. ఇంట్లో వాళ్లకు తెలిస్తే బాగుండదు అని కల్యాణ్ అంటే.. ఐ డోంట్ కేర్ అంటూ దిండు తీసుకెళ్తుంది అనామిక.

అలవాటు నీకు లేదుగా

తర్వాత ఉదయం రుద్రాణికి కాల్ చేస్తుంది స్వప్న. డ్రాకుల నిద్ర లేచినట్లుంది. నా రక్తం తాగడానికి అని రుద్రాణి ఆ కాల్ కట్ చేస్తుంది. కానీ, స్వప్న మళ్లీ మళ్లీ కాల్ చేయడంతో చేసేది లేక లిఫ్ట్ చేస్తుంది రుద్రాణి. ఎక్కడ చచ్చారు.. నాకు పొద్దున్నే కాఫీ తాగే అలవాటు ఉందిగా.. వెళ్లి పెట్టుకు రా అని అంటుంది స్వప్న. ఈ అలవాటు నీకు లేదుగా అని రుద్రాణి అంటే.. ఇవాళ్టి నుంచి ఉంటుందని స్వప్న అంటుంది. ఇవాళ్టి నుంచే మొదలయ్యే అలవాటుకు నేను తెలుసుకుని పెట్టుకురావాలన్నమాట అని రుద్రాణి హాల్లోకి వెళ్తుంది.

 

హాల్లో సోఫాపై పడుకున్న అనామికను చూసి.. ఈ కాపురం కూడా కొల్లేరు అయిందే.. శోభనం సంక నాకిపోయిందని చెబితే గానీ, నా కడుపు మంట చల్లారదు అని ఇంట్లో అందరిని పరుగెత్తుకుని పిలుచుకువస్తుంది రుద్రాణి. హాల్లో అనామికను చూసి అంతా షాక్ అవుతారు. అనామిక అంటూ లేపుతుంది ధాన్యలక్ష్మీ. నిద్ర లేచిన అనామిక అత్తయ్యా అంటూ ఏడుస్తూ ధాన్యలక్ష్మీని హగ్ చేసుకుంటుంది. అంతా షాక్ అవుతారు. రాత్రంతా ఇక్కడే పడుకున్నావా అని అడిగితే అవును అంటుంది.

నాకున్నవి రెండే దారులు

ఇంతలో పైనుంచి కల్యాణ్ వస్తాడు. అంతా ఏమైందని అడుగుతారు. అనామిక మనం గదిలోకి వెళ్లి మాట్లాడుకుందాం అని కల్యాణ్ అంటే.. నాలుగు గోడల మధ్యలో జరగాల్సింది.. అనామిక వచ్చి ఇక్కడ పడుకుందంటే ఏంటి అర్థం అని ఇందిరాదేవి నిలదీస్తుంది. అనామిక నీకు అండగా మేమున్నాం. నీకు వచ్చిన బాధేంటో చెప్పు అని భాగ్యలక్ష్మీ అంటుంది. ఇప్పుడు నాకున్నవి రెండే దారులు. ఒకటి పుట్టింటికి వెళ్లిపోవడం. లేదా చనిపోవడం అని అనామిక అంటుంది.

దాంతో అంతా నివ్వెరపోతారు. రేయ్ కల్యాణ్ ఏం చేశావురా. అనామిక అంత మాట అందని రాజ్ అంటాడు. చిన్న విషయం అన్నయ. అనామికే అపార్థం చేసుకుంటుంది అని కల్యాణ్ అంటాడు. ఒక ఆడపిల్ల అంత మాట అంటే ఏం అనకుండా ఉంటుందిరా అని రుద్రాణి అడుగుతుంది. నన్ను, మా అమ్మను నిలదీసే చిన్నత్తయ్య ఏం తీర్పు ఇస్తుందో చూడాలని రాహుల్ అంటాడు. నీకు కల్యాణ్‌కు పోలికేంటీ. కల్యాణ్ ఇప్పటివరకు ఒక్కరి మనసు కూడా నొప్పించడం నేను చూల్లేదు అని స్వప్న సపోర్ట్ చేస్తుంది.

 

అందరికీ సస్పెన్స్

అవును, కల్యాణ్ గురించి మనకు తెలుసు. జరిగింది తెలియాలంటే అనామిక ఏడుపు ఆపి చెప్పాల్సిందే అని ఇందిరాదేవి అంటుంది. అనామిక నేను తప్పుగా మాట్లాడి ఉంటే రియల్లీ సారీ. పదా అని తీసుకెళ్తుంటాడు కల్యాణ్. అలా ఎలా కుదుర్తుంది. నా కొడుకు తప్పు చేస్తే రచ్చబండ చేస్తారు. ఇప్పుడు ఎలా వదిలేస్తాం. జరిగిందేంటో చెప్పకుంటే అందరికీ సస్పెన్స్‌లాగే ఉంటుంది అని రుద్రాణి అంటుంది. అనామిక అందరికీ ఎందుకు అవకాశం ఇస్తున్నావ్. ఏం జరిగిందో చెప్పమని అపర్ణ అంటుంది.

నన్ను కొట్టిన తిట్టిన ఆ గదిలోనే పడి ఉండేదాన్ని. కానీ, శోభనం గదిలో అప్పు ప్రస్తావన తీసుకొస్తున్నాడు.. ఈ కావ్య ప్రస్తావన తీసుకొస్తున్నాడు అని అనామిక చెప్పడంతో అంతా షాక్ అవుతారు. తన దృష్టిలో కావ్య ఒక ఇలవేల్పు.. అప్పు ఒక ప్రేమదేవత.. భార్యగా నాకు విలువ ఇవ్వడం లేదని అనామిక అంటుంది. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదేంట్రా అని సుభాష్ అంటాడు. అనామిక నీకు దండం పెడతాను. మధ్యలో మా వదినను ఎందుకు తీసుకొస్తున్నావ్ అని కల్యాణ్ అంటాడు.

కళ్లు చల్లబడ్డాయా

చూశారా అత్తయ్యా.. ఇలాగే అంటాడు. శోభనం గదిలో వదినను దేవతను చేసి మాట్లాడతుంటే నాకు ఎలా ఉంటుంది అని అనామిక అంటుంది. ఏమ్మా మహాతల్లి.. పెళ్లి చెడగొట్టాలని చూశావ్. ఇప్పుడు శోభనం క్యాన్సిల్ కావడానికి కారణం అయ్యావా. ఇప్పుడు నీ కళ్లు చల్లబడ్డాయా. నీ చేయి తగిలితే సర్వనాశనం అన్నాను కదా. ఇప్పుడు అలాగే జరిగింది. ఎందుకంటే నువ్ మంచి కోరుకోవు కదా అని ధాన్యలక్ష్మీ అంటుంది. పిన్నీ.. అని గట్టిగా అరుస్తాడు రాజ్.

 

అనామిక, కల్యాణ్ గొడవకు కావ్యను అనడం కరెక్ట్ కాదు. తననెందుకు లాగుతున్నారు అని రాజ్ గట్టిగా అంటాడు. ఇప్పుడు నీ పిన్ని గయ్యాలి అయిందా.. చూశావా అక్క నీ కొడుకును కూడా మార్చేసింది. రేపు నిన్ను కూడా అంటాడు. ఎవరో అడ్డమైన వాళ్లకోసం ఇంత జరుగుతుంది అని ధాన్యలక్ష్మీ అంటుంది. చిన్నత్తయ్య.. అడ్డమైన వాళ్లు అనడం కరెక్ట్ కాదు. కవిగారికి అందరు ఒక్కటే.. అభిమానంతో ఒక చిన్న మాట అని ఉండొచ్చు. దానికి నన్ను లాగడం ఏంతవరకు పద్ధతి అని కావ్య అంటుంది.

మధ్యలోకి రాకు..

నువ్ నాకు పద్ధతులు నేర్పుతున్నావా. నువ్ అప్పును నా కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకోలేదా అని ధాన్యలక్ష్మీ అంటుంది. అనుకోలేదు. మీరు అలా అనుకుంటే నేను ఏం చేయలేను. నన్ను సాధించాలని కంకణం కట్టుకుంటే ఏం చేయలేను అని కావ్య అంటుంది. నేను సాధిస్తున్నానా.. అని ధాన్యలక్ష్మీ అంటే.. అవును అని స్వప్న అంటుంది. నువ్ మధ్యలోకి రాకు.. రాహుల్‌తో లేచిపోయిన నువ్వు.. రాజ్‌తో ముసుగు వేసుకుని పెళ్లికి కూర్చున్న నువ్ చెబుతున్నావా అని ధాన్య అంటుంది.

అదంతా విన్న రాజ్.. రేయ్.. కల్యాణ్.. అని గట్టిగా అరుస్తాడు. దాంతో అంతా రాజ్‌ను చూస్తారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్‌లో మీ గురించి మీరు మాట్లాడుకోండి. చిన్నదైనా మా ప్రస్తావన తీసుకురాకండి అని అనామికతో చెబుతుంది కావ్య. తర్వాత రాజ్‌ భుజానికి ప్రేమగా ఒరిగి.. మీరు నాకు అండగా ఉంటే.. గోవర్ధనగిరిని కూడా ఒంటి చేత్తో ఎత్తగలను అన్న నమ్మకం వచ్చిందండి అని కావ్య ప్రేమగా అంటుంది. దాంతో రాజ్ కాస్తా ఇబ్బందిగా.. ప్రేమగా ఫీల్ అవుతాడు.

 
WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024