Krishna mukunda murari serial january 17th episode: కృష్ణ, మురారి శోభనానికి ఏర్పాట్లు.. చివర్లో ట్విస్ట్ ఇచ్చిన ముకుంద

Best Web Hosting Provider In India 2024

Krishna mukunda murari serial january 17th episode: ఇంటి ముందు ముగ్గు తను వేయలేదని రేవతి చెప్తుంది. అప్పుడే ముకుంద హారతి పట్టుకుని వస్తుంది. మధు ఇదంతా నమ్మకంగా లేదని నటనలా అనిపిస్తుందని అంటాడు. ముగ్గు నువ్వు వేశావా అని కృష్ణ ముకుందని అడుగుతుంది. అవును నేనే వేశానని చెప్తుంది. ముగ్గు నా డ్యూటీ కదా నువ్వు ఎందుకు వేశావని అంటుంది. ఎప్పుడు ఇతరుల గురించే కాదు నీ గురించి కూడా ఆలోచించుకో. ఈరోజు నీ శోభనం కదా ఏ పని చేయవద్దని ముకుంద చెప్పేసరికి కృష్ణ తెగ సిగ్గుపడిపోతుంది.

ట్రెండింగ్ వార్తలు

శోభనానికి ముహూర్తం పెట్టిన పంతులు

కృష్ణ నన్ను క్షమించింది తన రుణం తీర్చుకోవడానికి ఎన్ని జన్మలైన సరిపోదని ముకుంద అంటుంది. మురారి నిద్రలేచి కృష్ణని పిలుస్తాడు. కృష్ణ వచ్చి ఇంటి ముందు ముగ్గు ఆల్రెడీ వేసేశారని ముకుంద వేసిందని చెప్తుంది. కొత్తగా తను వేయడం ఏంటి ఎందుకు వేసిందని అడుగుతాడు. ఇప్పుడు నీకు ఏ పని చెప్పను హ్యాపీగా రెస్ట్ తీసుకోమని చెప్పిందని సిగ్గుపడుతూ చెప్తుంది. హాల్ లో అందరూ పంతులు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మధు పంతులు రాలేదు ఏంటని హడావుడి చేస్తాడు. భవానీ వచ్చి అసలైన వాళ్ళు ఎక్కడని అడుగుతుంది. అప్పుడే మురారి, కృష్ణ వస్తారు.

శోభనం ముహూర్తం పెట్టడానికి పంతులు వస్తున్నాడని చెప్పేసరికి కృష్ణ సిగ్గు మొగ్గలవుతుంది. శోభనానికి కావాల్సిన వస్తువులు తను వెళ్ళి తీసుకొస్తానని ముకుంద అంటుంది. కానీ భవానీ మాత్రం అవన్నీ తీసుకురావడానికి నందు, గౌతమ్ ని పంపించు ఎంతైనా శుభకార్యం కదా అనేసరికి ముకుంద కంటి నిండా నీళ్ళు పెట్టుకుంటుంది. నాకులాగే పెద్ద పెద్దమ్మ కూడా ముకుందని నమ్మడం లేదని మధు మనసులో అనుకుంటాడు. పంతులు వచ్చి లేట్ అవుతుందని ఇంటి దగ్గరే ముహూర్తం పెట్టుకుని వచ్చానని చెప్తాడు. మంచి ముహూర్తం పెట్టానని సంతాన ప్రాప్తి లభిస్తుందని పంతులు అంటాడు. తమకి ఆడపిల్ల కావాలని రేవతి, సుమలత అంటారు. రాత్రికి ముహూర్తం ఉందని చెప్పి పంతులు వెళ్ళిపోతాడు.

కృష్ణని మెచ్చుకున్న భవానీ

కృష్ణని బయటకి వెళ్దామని ముకుంద అంటుంది. రేవతి భవానీ దగ్గరకి వస్తుంది. మురారి విషయం మాట్లాడటం కోసం వచ్చానని చెప్తుంది. కృష్ణ గురించి తను మాట్లాడాలని అనుకుంటున్నట్టు భవానీ చెప్పేసరికి రేవతి కంగారుపడుతుంది. కృష్ణ అన్ని మంచి పనులే చేసింది ఒక్క అగ్రిమెంట్ విషయంలో తప్ప. ఆ విషయంలోనే కాస్త ఎక్కువగా రియాక్ట్ అయ్యాను అంతే అనేసరికి రేవతి ఊపిరి పీల్చుకుంటుంది. అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ముకుంద కూడా మారిపోయిందని చెప్తుంది. ఉద్యోగంలో రూపం మారడం వల్ల జాబ్ ప్రాబ్లం అయ్యింది. మీరే ఏదో ఒకటి చేసి ఉద్యోగం ఇప్పిస్తే బాగుంటుందని రేవతి అడుగుతుంది. సరే చూద్దాంలే ప్రస్తుతం ఎంజాయ్ చేయనివ్వమని అంటుంది.

కృష్ణ కోసం కట్టిస్తున్న హాస్పిటల్ కాంట్రాక్ట్ పెద్దపల్లి ప్రభాకర్ కి అప్పగించాలని అనుకుంటున్నట్టు భవానీ చెప్తుంది. ఆ మాటకి రేవతి సంతోషిస్తుంది. అన్ని శుభవార్తలు వింటున్నాం ఏమవుతుందోనని రేవతి భయపడుతుంటే ఇక మంచి రోజులు వచ్చినట్టేనని భవానీ ధైర్యం చెప్తుంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వెళ్లాలని కృష్ణ వాళ్ళు అనుకుంటున్నారు పంపిద్దామా అని రేవతి అడిగితే వెళ్ళమని చెప్తుంది. ముకుంద కృష్ణని రెస్టారెంట్ కి తీసుకుని వెళ్తుంది. బ్యూటీ పార్లర్ కి వెళ్లాలని చెప్పి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావని అడుగుతుంది.

కృష్ణకి థాంక్స్ చెప్పిన ముకుంద

ఇంటి నుంచి అందరూ నన్ను నిర్దాక్షిణ్యంగా వెళ్లగొడుతుంటే నువ్వు ఒక్కదానివే నాతరపున నువ్వు నిలబడ్డావు. పెద్దత్తయ్యకి నా గురించి బాధ్యత తీసుకున్నావని థాంక్స్ చెప్పి ఎమోషనల్ అవుతుంది. మధు శోభనానికి కావలసిన వస్తువులన్నీ తీసుకొస్తాడు. మురారి వచ్చి కృష్ణ ఎక్కడని అడుగుతాడు. రేర్ కాంబినేషన్ బయటకి వెళ్ళిందని మధు అంటాడు.

ముకుంద కృష్ణని తీసుకుని బయటకి వెళ్ళిందని చెప్పడంతో మురారి కొద్దిగా టెన్షన్ పడతాడు. అప్పుడే కృష్ణని అందంగా తయారు చేసుకుని ముకుంద తీసుకొస్తుంది. తనని చూసి అందరూ షాక్ అవుతారు. చాలా అందంగా ఉందని మెచ్చుకుంటారు. మురారి భార్యని అలా చూస్తూ ఉండిపోతాడు. కృష్ణ ముకుందకి థాంక్స్ చెప్తుంది.

ట్విస్ట్ ఇచ్చిన ముకుంద

కృష్ణని శోభనం కోసం ముకుంద రెడీ చేస్తూ ఉంటుంది. ఈ కార్యం ఎప్పుడో జరగాల్సింది పాపం వాళ్ళ జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు అంతా ఇంతా కావు. యికం ఉండు వీళ్ళ జీవితంలోకి కష్టాలు రాకుండా చూడాలని రేవతి మనసులో అనుకుంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో శోభనం గదిని అందంగా రెడీ చేస్తారు. కృష్ణ గదిలోకి వెళ్లబోతు ఉండగా ముకుంద గురించి అడుగుతుంది. ముకుంద ఏడుస్తూ నిలబడటం చూస్తారు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024