Rishab Shetty: హనుమాన్ మూవీపై కాంతార హీరో కామెంట్స్.. ఏమన్నాడంటే?

Best Web Hosting Provider In India 2024

Rishab Shetty About Hanuman: జనవరి 12న సంక్రాంతి సందర్భంగా విడుదలైన హనుమాన్ మూవీకి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికే ఇతర సినీ ఇండస్ట్రీల నుంచి హనుమాన్ మూవీపై, డైరెక్టర్ ప్రశాంత్ వర్మను ప్రశంసిస్తూ కామెంట్స్ చేశారు. తాజాగా కాంతారా హీరో అండ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి హనుమాన్ మూవీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దాంతో ఇప్పుడు సోషల్ మీడియాలో రిషబ్ శెట్టి కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.

 

ట్రెండింగ్ వార్తలు

హనుమాన్ సినిమాపై ఎక్స్‌లో (ఒకప్పటి ట్విటర్) ట్వీట్ చేసిన రిషబ్ శెట్టి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి మాట్లాడారు. “హనుమాన్ సినిమాను ప్రశంసించేందుకు అందరితోపాటు నేనూ కూడా చేతులు కలుపుతున్నాను. ప్రశాంత్ వర్మ కథను తెరకెక్కించిన విధానం, నిర్మాణ విలువలు ఈ స్థాయి విజయాన్ని అందించాయి. తేజ సజ్జ తన నటనతో ఆకట్టుకున్నాడు సినిమా చూసిన తర్వాత కూడా మీ నటన అందరికీ గుర్తుండిపోతుంది” అని కాంతార హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి పేర్కొన్నారు.

హనుమాన్ సినిమాను రిషబ్ శెట్టి ప్రశంసిస్తూ ట్వీట్ చేయడంపై నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. “మీ నుంచి ప్రశంసలు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది రిషబ్ సర్”, “హనుమాన్ సినిమాను మెచ్చుకునే వారి సంఖ్య రాను రాను పెరిగిపోతోంది”, “దక్షిణాదిలోని అన్ని ఇండస్ట్రీల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మంచి పనిని అంగీకరించి మెచ్చుకున్న రిషబ్ శెట్టికి హ్యాట్సాఫ్” అంటూ నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

హనుమాన్ సినిమాపై సమంత కూడా కామెంట్స్ చేసింది. హనుమాన్ రూ. 100 కోట్ల వసూళ్లు సాధించడంపై సంతోషం వ్యక్తం చేసింది. అలాగే “పోస్టర్ షేర్ చేస్తూ మీరు అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు” అని క్యాప్షన్ రాసుకొచ్చింది సమంత. కాగా సమంత, తేజ సజ్జ ఓ బేబీ సినిమాలో కలిసి నటించిన విషయం తెలిసిందే.

 

“ఈ చిత్రంలో తేజ సజ్జ బాగా నటించాడు. ఎంతో కష్టమైన సన్నివేశాలను కూడా సులువుగా చేశాడు. డైరెక్టర్ విజన్ మరో స్థాయిలో ఉంది. నటీనటులందరూ వారి పాత్రలకు నూరు శాతం న్యాయం చేశారు. వరలక్ష్మి శరత్ కుమార్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఒక్క మాటలో చెప్పాలంటే మూవీ అద్భుతం. చివరి 30 నిమిషాలు నాకు గూస్ బంప్స్ వచ్చాయి. 2025లో రానున్న జై హనుమాన్ కూడా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా” అని కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ అన్నారు.

ఇదిలా ఉంటే హనుమాన్ సినిమాలో తేజ సజ్జ, అమృత అయ్యర్ హీరోహీరోయిన్లుగా చేస్తే.. వరలక్ష్మీ శరత్ కుమార్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను, సత్య తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి హనుమాన్ మూవీని నిర్మించగా.. శ్రీమతి చైతన్య సమర్పించారు. ఇక జనవరి 12న మహేశ్ బాబు గుంటూరు కారంతో పోటీ పడి మరి హనుమాన్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ సహా పలు భారతీయ, అంతర్జాతీయ భాషల్లో రిలీజ్ చేశారు.

 
WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024