Weight Loss Naturally : బరువు తగ్గేందుకు కోడిగుడ్లతో ఈ ఆహారాలు కలిపి తినండి

Best Web Hosting Provider In India 2024

గుడ్లను దాదాపు అందరూ ఇష్టపడుతుంటారు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా చాలామందికి ఇష్టమైన ఆహారం. గుడ్లు ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం కూడా. ఆమ్లెట్, ఉడికించిన గుడ్లు.. ఎలా తిన్నా, పోషకాలు శరీరానికి దొరుకుతాయి. గుడ్లు తింటే పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. దీంతో ఆకలి వేయదు.

ట్రెండింగ్ వార్తలు

విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్న గుడ్లు శరీరంలోని వేలకొద్దీ సమస్యలకు సమర్థవంతంగా పనికొస్తాయి. గుడ్లు ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు దానికి కొన్ని పదార్ధాలను జోడించినట్లయితే మరికొన్ని ప్రయోజనాలను కూడా పొందొచ్చు.

మన సాధారణంగా చూస్తే.. అనేకమంది ఎగ్ ఆమ్లెట్లో కారం పొడిని వాడుతారు. అయితే దీనికి బదులుగా మిరియాల పొడిని వాడుకోండి. ఇది ఆహారానికి రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. మిరియాలలో కొలెస్ట్రాల్‌ తగ్గించి బరువు తగ్గడంలో సహాయపడే పదార్థాలు ఉంటాయి.

పసుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగు క్యాప్సికమ్‌లు చూడ్డానికి బాగుండడమే కాకుండా పోషక విలువలు కూడా చాలా ఎక్కువగా దొరుకుతాయి. వాటిలో విటమిన్ సి పుష్కలంగా దొరుకుతుంది. కొవ్వును తగ్గించడంలో ఉపయోగపుడతుంది. మనిషికి శక్తిని పెంచుతుంది.

నూనెలో ఎగ్ ఆమ్లెట్ చేసుకుంటే కేలరీలు చాలా పెరుగుతాయి. ఈ ప్రభావంతో బరువు కూడా పెరుగుతుంది. బరువు అదుపులో ఉండాలంటే కొబ్బరినూనెలో గుడ్లు వేసి ఆమ్లెట్ చేసుకోవాలి. విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్, కొబ్బరి నూనెలో పుష్కలంగా ఉండటం కారణంగా శరీరంలోని కొవ్వును పోగొట్టి బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.

పాలకూరలో పోషకాలు పుష్కలంగా దొరుకుతాయి. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగానే ఉంటాయి. ఇందులో కేలరీలు కూడా చాలా తక్కువ. ఇది త్వరగా కొవ్వును తొలగిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మీరు గుడ్డు ఆమ్లెట్, ఎగ్ భూర్జి చేసినప్పుడు పాలకూరను కలపొచ్చు.

బరువు తగ్గడానికి ఓట్స్ ఎంతో మేలు చేస్తుంది. ఓట్స్‌లో కేలరీలు ఉండవు. ఇందులో ఉండే స్టార్చ్ జీర్ణక్రియను వేగవంత చేస్తుంది. శరీరంలోని కొవ్వును తగ్గించుకోవడానికి పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. గుడ్లు, వోట్మీల్ రెండింటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఓట్ మీల్ ను గుడ్లతో కలిపి తినడం వల్ల జీవక్రియ పెరుగుతుంది.

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024