AP AHA Results 2024 : ఏపీ ఏహెచ్ఏ రిజల్ట్స్ విడుదల రేపటికి వాయిదా

Best Web Hosting Provider In India 2024

AP AHA Results 2024 : ఏపీ పశు సంవర్థక సహాయకుల పోస్టుల నియామక రాత పరీక్ష ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ రేపు(గురువారం) ఏహెచ్ఏ ఫలితాలు విడుదల చేస్తారు. ఏహెచ్ఏ ఫలితాలను https://apaha-recruitment.aptonline.in/ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఏపీ పశుసంవర్థక శాఖలో 1896 యానిమల్‌ హస్బెండరీ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి డిసెంబర్ 31న రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాత పరీక్ష ప్రాథమిక, ఫైనల్ కీ విడుదలయ్యాయి.

 

ట్రెండింగ్ వార్తలు

ఈ నెలలోనే జాయినింగ్ లెటర్స్

పశుసంవర్థక శాఖలో 1896 పోస్టుల భర్తీకి చేపట్టిన నియామక పరీక్ష ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. సచివాలయాలకు అనుబంధంగా వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల్లో పశు సంవర్థక సహాయకులు పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థుల నుంచి నవంబర్‌ 20వ తేదీ నుంచి డిసెంబర్‌ 11వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఈ ఉద్యోగాల భర్తీకి రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశారు. డిసెంబర్ 27న రాత పరీక్షకు హాల్ టికెట్లు విడుదల చేయగా, డిసెంబర్ 31న ఆన్ లైన్ ద్వారా రాత పరీక్ష నిర్వహించారు. ఈ రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు ఈ నెలలోనే జాయినింగ్ లెటర్స్ అందిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు మొదట రెండేళ్ల పాటు ప్రొబేషన్ ఉంటుంది. ప్రొబేషన్ సమయంలో రూ.15 వేల చొప్పున చెల్లిస్తారు. అనంతరం నెలకు రూ.22, 460 జీతం చెల్లిస్తారు.

జిల్లాల వారీగా పోస్టుల వివరాలు

  • పశ్చిమ గోదావరి జిల్లాలో -102
  • తూర్పు గోదావరి జిల్లాలో -15
  • అనంతపురం జిల్లాలో -473
  • చిత్తూరు జిల్లాలో- 100
  • కర్నూలు జిల్లాలో- 252
  • కడప జిల్లాలో- 210
  • గుంటూరు జిల్లాలో -229
  • కృష్ణా జిల్లాలో- 120
  • నెల్లూరు జిల్లాలో- 143
  • ప్రకాశం జిల్లాలో- 177
  • విశాఖపట్నం జిల్లాలో- 28
  • విజయనగరం జిల్లాలో- 13
  • శ్రీకాకుళం జిల్లాలో- 34

ఏపీ ప్రభుత్వం సచివాలయాలకు అనుబంధంగా గ్రామ స్థాయిలో 10,778 వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసింది. వీటిల్లో 9,844 పశు సంవర్థక సహాయకులు అవసరమని గుర్తించింది. ఇందుకుగాను రెండు విడతల్లో 4,643 ఆర్బీకేల్లో వీఏహెచ్‌ఏ పోస్టులను భర్తీ చేసింది. తాజాగా ఆర్బీకేల్లో మిగిలిన 1,896 వీఏహెచ్‌ఏ పోస్టుల భర్తీ చేపట్టింది.

 

ఏహెచ్ఏ ఫలితాలు ఇవాళే విడుదల కావాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాలతో ఫలితాల విడుదల రేపటికి వాయిదా పడింది. ఈ విషయాన్ని అధికారులు తెలిపారు.

 

WhatsApp channel
 

టాపిక్

 
 
JobsGovernment JobsCm JaganAndhra Pradesh NewsGovernment Of Andhra PradeshTelugu News

Source / Credits

Best Web Hosting Provider In India 2024