Best Web Hosting Provider In India 2024
మగవారితో పోలిస్తే మహిళలు చాలా త్వరగా బరువు పెరిగిపోతారు. ముఖ్యం పెళ్లయి, పిల్లలు పుట్టాక మహిళల శరీరంలో మార్పులు త్వరగా వస్తాయి. డెలీవరీ సమయంలో పెరిగిన బరువు ఆ తరువాత తగ్గడం కష్టంగా మారుతుంది. బాగా బరువు పెరిగాక దానిని తగ్గించేందుకు శస్త్రచికిత్సలు చేయించుకోవడం, ఆహారం తినకపోవడం, లేనిపోని డైట్లు పాటించడం వంటివి చేస్తుంటారు. అయితే బరువు పెరగడం, ఊబకాయం వల్ల ఎన్నో అనారోగ్యాలు వస్తాయి. అందంగా కనిపించడం కోసమే కాదు, ఆరోగ్యం కోసం కూడా బరువును తగ్గించుకోవాలి. అది కూడా ఆరోగ్యకరమైన పద్ధతిలో తగ్గించుకోవడం చాలా అవసరం. ఈ విషయంలో అవగాహన కల్పించేందుకే ప్రతి ఏడాది జనవరి నెలలో వచ్చే మూడో గురువారం మహిళలు ఆరోగ్యంగా బరువు తగ్గడం ఎలా అనే అంశంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక రోజును కేటాయించారు.
ట్రెండింగ్ వార్తలు
మహిళలు కాదే, పురుషుల కూడా బరువును అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. బరువు పెరిగితే హృదయ సంబంధ వ్యాధులు, అధిక రక్తపోటు, టైప్ 2 డయాబెటిస్, కాలేయ వ్యాధి, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సమతుల్య ఆహారం తీసుకోవాలి. అదనపు కిలోలను తగ్గించడానికి కఠినమైన వ్యాయామాలను చేయాల్సిన అవసరం లేదు, కానీ మొత్తం రన్నింగ్, వాకింగ్ వంటివి చేయడం అవసరం. అదనపు బరువునున తగ్గించడానికి, ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని సులువైన మార్గాలు ఉన్నాయి
1. స్థిర నిర్ణయం తీసుకోండి
బరువు విషయంలో మీరు గట్టి నిర్ణయం తీసుకోవాలి. బరువును తగ్గించుకోవాలని, అది కూడా ఆరోగ్యకర పద్ధతిలోనే తగ్గించుకోవాలని స్థిర నిర్ణయం తీసుకోండి. తేలికపాటి ఆహారాన్ని తినడంతో పాటూ, కేలరీలను బర్న్ చేసే వ్యాయామాలను ప్రతిరోజూ చేయాలి. పోహాకాహార లోపం వంటివి రాకుండా చూసుకోవాలి. బరువు తగ్గడానికి తృణధాన్యాలు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటివి నిండిన ఆహారాలను తీసుకోవాలి. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోండి. అతిగా తినడం లేదా తక్కువగా తినడం వంటివి చేయకూడదు.
2. నచ్చినవే చేయండి
బరువు త్వరగా తగ్గాలన్న కోరికతో కష్టమైన వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదు. వెయిట్ లిఫ్టింగ్, ట్రెడ్ మిల్, పుష్-అప్ ల వంటి వ్యాయామాలే కాదు మీకు ఆసక్తిగా, తేలికగా అనిపించే వ్యాయామాలను చేయండి. రన్నింగ్, వాకింగ్ వంటివి రోజూ గంట పాటూ చేస్తే చాలు.
3. బాగా నిద్రపోండి
బరువు తగ్గడానికి శరీరానికి కావాల్సినంత విశ్రాంతి కూడా అవసరం. ప్రతిరోజూ తగినంత నిద్రపోవాలి. ఒత్తిడి నుంచి దూరంగా ఉండాలి. మెనోపాజ్ దశలో ఉన్న మహిళలకు సరిగా నిద్రపట్టదు. ప్రశాంతంగా ఉండి నిద్రపోవడానికి ప్రయత్నించాలి. ఆరోగ్యకరమైన నిద్ర బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
4. పొట్ట కొవ్వుతో
పొట్ట దగ్గర కొవ్వు చేరడం చాలా ప్రమాదకరం విషయం. అది అనేక రోగాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి పొట్టకొవ్వును తగ్గించే వ్యాయామాలు చేయడం చాలా అవసరం. పొత్తి కడుపు చుట్టూ చేరిన కొవ్వు ప్రాణాంతక వ్యాధులకు కారణం అవుతుంది. కాబట్టి పొత్తి కడుపు దగ్గర కొవ్వును పెరగకుండా జాగ్రత్త పడాలి. వాకింగ్, రన్నింగ్ చేయడం ద్వారా పొట్ట కొవ్వును కరిగించుకోవచ్చు.