Best Web Hosting Provider In India 2024
మూత్రపిండాల వ్యాధులు ఎక్కువ మంది ప్రజలను ఇబ్బందిపెడుతున్నాయి. ఈ వ్యాధి వచ్చాక తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ సమస్య ఇంకా పెరిగిపోతుంది. కిడ్నీ వ్యాధి అనే దీర్ఘకాలికమైనది. ఒక్కసారి వస్తే జీవితాంతం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ముఖ్యంగా ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా తీసుకునే జాగ్రత్తల వల్ల హృదయ సంబంధ సమస్యలు, ఎముక వ్యాధులు, రక్తహీనత వంటి ఇతర ఆరోగ్య సమస్యలను రాకుండా అడ్డుకోవచ్చు. కిడ్నీవ్యాధులు ఉన్న వారు వ్యాయామం చేయకపోవడం, గంటలపాటూ కదలకుండా కూర్చోవడం వంటివి చేయకూడదు. అలాగే అధికరక్తపోటు, మధుమేహం ఉన్న వారు కూడా కిడ్నీ వ్యాధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీ సమస్యలు ఉంటే వికారం, వాంతులు, ఆకలి లేకపోవడం, అలసట, మానసికంగా చురుగ్గా లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మూత్రపిండాల వ్యాధిని ప్రారంభ దశలో నిర్ధారించడం కష్టం, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
ట్రెండింగ్ వార్తలు
కిడ్నీ వ్యాధులు ఉన్నవారు పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. పండ్లు, కూరగాయలు, చేపలు, గుడ్లు, తక్కువ స్థాయిలో సంతృప్త కొవ్వులు ఉన్న ఆహారాలు, ఉప్పు, చక్కెర తక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవాలి. ఆహారంలో పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇంట్లో తయారుచేసిన ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. బయట దొరికే పదార్థాలలో సోడియం అధికంగా ఉంటుంది.
ఆరోగ్యకరమైన మూత్రపిండాల కోసం ఆహారాలు
1. పసుపు: యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు ప్రసిద్ది చెందిన పసుపు థైరాయిడ్, మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది. దీనిలో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. దీనిలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువ. మూత్రపిండాల వ్యాధి వల్ల వచ్చే మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.
2. పెరుగు: భారతీయ వంటకాల్లో ప్రధానమైనది పెరుగు. థైరాయిడ్ పనితీరుకు అవసరమైన అయోడిన్ దీనిలో ఉంటుంది. మూత్రపిండాలను కాపాడుకునేందుకు ప్రతిరోజూ పెరుగును తినాలి. తక్కువ కొవ్వు ఉన్నపెరుగును ఎంచుకోవాలి.
3. ఆకుకూరలు: విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండిన ఆకుకూరలు తినడం వల్ల థైరాయిడ్, మూత్రపిండాల ఆరోగ్యం చక్కగా ఉంటుంది. వీటిలో పొటాషియం తక్కువగా ఉంటుంది. వీటిలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణవ్యవస్థను కాపాడుతుంది.
4. పెసర పప్పు: ప్రోటీన్ పెసరపప్పులో పుష్కలంగా ఉంటుంది. అలాగే పొటాషియం, భాస్వరం తక్కువగా ఉంటాయి. కాబట్టి మూత్రపిండాల సమస్యలు ఉన్నవారికి పెసరపప్పు ఎంతో మంచిది.
5. చిరుధాన్యాలు: ఇతర ధాన్యాలతో పోలిస్తే చిరుధాన్యాలు ఎంతో మంచివి. వీటిలో భాస్వరం తక్కువగా ఉంటుంది. సజ్జలు, జొన్నలు, కొర్రలు వంటి చిరుధాన్యాలతో రోటీలు, అనేక రకాల రెసిపీలు వండుకోవచ్చు. వాటిని తింటే మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి.