Best Web Hosting Provider In India 2024
Prabhas Salaar OTT Streaming: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ప్రభాస్ సినిమాల కోసం ఫ్యాన్స్, తెలుగు ప్రేక్షకులే కాదు.. బాక్సాఫీస్ కూడా ఎదురుచూస్తుంటుంది. అలాంటి ప్రభాస్ నటించిన సినిమాల్లో సలార్ ఒకటి. ది మోస్ట్ క్రేజీయెస్ట్ చిత్రంగా వచ్చిన సలార్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.
ట్రెండింగ్ వార్తలు
మొదటి షో నుంచి
కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రభాస్ క్రేజీయెస్ట్ మూవీ సలార్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. అందుకు తగినట్లుగానే సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ (Salaar: Part 1 Ceasefire) భారీ అంచనాల నడుమ డిసెంబర్ 22న అంటే శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. మొదటి షో నుంచే సినిమాపై పాజిటివ్ టాక్, రివ్యూస్ వచ్చాయి. ఇది కదా ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకునేదంటూ సంతోషం వ్యక్తం చేశారు అభిమానులు.
ఏకైక సౌత్ హీరోగా
చాలా కాలం తర్వాత ప్రభాస్ కటౌట్‌కు సరైన సినిమా పడిందని అభిమానులు పండుగ చేసుకున్నారు. ఫలితంగా సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్లతో అరాచకం సృష్టించింది. సలార్ సినిమాకు ఇప్పటికీ రూ. 700 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. బాహుబలి 1, బాహుబలి 2, సాహో తర్వాత 600 కోట్లు దాటిన మూడో సినిమాగా సలార్ రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే సౌత్ సినీ ఇండస్ట్రీ నుంచి మూడు సార్లు 600 కోట్ల మార్క్ అందుకున్న ఏకైక హీరోగా ప్రభాస్ చరిత్ర సృష్టించాడు.
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
ఇదిలా ఉంటే గత కొంతకాలంగా సలార్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఆసక్తి నెలకొంది. జనవరి 15న త్వరలో సలార్ మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. అయితే, సలార్ మూవీని జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఓటీటీలో విడుదల చేస్తారని టాక్ నడిచింది. కానీ, అనూహ్యంగా, ఊహించనివిధంగా ప్రభాస్ ఫ్యాన్స్‌కు నెట్ ఫ్లిక్స్ గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 26 కంటే ఆరు రోజుల ముందే సలార్ మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనుంది.
అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్
అంటే, జనవరి 20 నుంచే ప్రభాస్ సలార్ మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించింది నెట్ ఫ్లిక్స్. ఓటీటీలో సలార్ అని టైప్ చేస్తే.. శనివారం నుంచి స్ట్రీమింగ్ అని రాసి ఉంది. శనివారం జనవరి 20 అని స్పష్టంగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అంటే, ఇవాళ అర్ధరాత్రి నుంచే సలార్‌ను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసే అవకాశం కనిపిస్తోంది.
రూ. 160 కోట్లు చెల్లించి
మరికొన్ని గంటల్లో సలార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్‌లో పూనకాలు మొదలయ్యాయి. కాగా నెట్ ఫ్లిక్స్‌లో సలార్ మూవీని తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. కానీ, ఒక హిందీలో మాత్రం విడుదల చేయట్లేదు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26 నుంచి సలార్ హిందీలో అందుబాటులో ఉంటుందేమో చూడాలి. ఇదిలా ఉంటే సలార్ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ సుమారు రూ. 160 కోట్ల భారీ ధర చెల్లించి కొనుగోలు చేసినట్లు సమాచారం.