Best Web Hosting Provider In India 2024
Indra Movie Trp Rating: చిరంజీవి ఇంద్ర మూవీ రిలీజై ఇరవై రెండేళ్లు అవుతోంది. అయినా ఈ సినిమాకు ఉన్న క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు. ఇంద్ర శాటిలైట్ హక్కులను ఇటీవల జీ తెలుగు కొనుగోలు చేసింది. డిసెంబర్‌లో జీ తెలుగులో ఇంద్ర సినిమా టెలికాస్ట్ అయ్యింది. ఇంద్ర టీవీ ప్రీమియర్‌కు అదిరిపోయే రేటింగ్ వచ్చింది. అర్బన్ ఏరియాలో 5.59 టీఆర్‌పీ రేటింగ్‌ను సొంతం చేసుకున్నది. అర్బన్, రూరల్ ఏరియాల్లో కలిపి 5.66 టీఆర్‌పీ రేటింగ్‌ను ఈ మూవీ దక్కించుకున్నది. రిలీజై చాలా ఏళ్లయినా ఇంద్ర సినిమాకు ఉన్న క్రేజ్, బజ్ తగ్గలేదనడానికి ఈ టీఆర్‌పీ రేటింగ్ ఉదాహరణ అంటూ అభిమానులు చెబుతోన్నారు.
ట్రెండింగ్ వార్తలు
జెమిని టీవీ నుంచి…
ఇంద్ర సినిమా శాటిలైట్ హక్కులను తొలుత జెమిని టీవీ కొనుగులు చేసింది. దాదాపు ఏడెనిమిదేళ్ల పాటు టీవీలో ఈ సినిమా టెలికాస్ట్ కాలేదు. జెమిని టీవీ శాటిలైట్ హక్కులకు సంబంధించిన ఒప్పందం ఇటీవలే ముగిసింది. దాంతో ఇంద్ర శాటిలైట్ హక్కులను నిర్మాతల నుంచి జీ తెలుగు సొంతం చేసుకున్నది. ఇంద్ర టీవీలో టెలికాస్ట్ అయిన టైమ్‌లోనే జెమిని టీవీలో ఆచార్య టెలికాస్ట్ చేశారు. ఆచార్యకు అర్బన్‌లో 2.29, ఆర్బన్ ప్లస్ రూరల్‌లో కలిపి 2.76 టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది. ఇంద్ర కంటే చాలా తక్కువ టీఆర్‌పీ రేటింగ్‌ను ఆచార్య దక్కించుకున్నది.
2002లో రిలీజ్
ఇంద్ర సినిమా 2002లో థియేటర్లలో రిలీజైంది. ఫ్యాక్షనిజం బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు బి. గోపాల్ దర్శకత్వం వహించాడు. దాదాపు పదికోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ అప్పట్లోనే 55 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. నిర్మాతలకు ఇరవై ఐదు కోట్ల లాభాల్ని తెచ్చిపెట్టి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. తెలుగు సినీ చరిత్రలోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా ఇంద్ర రికార్డ్‌ను చాలా కాలం పాటు ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు. రిలీజైన తొలి వారంలోనే ఇరవై కోట్ల కలెక్షన్స్ రాబట్టిన తొలి మూవీగా ఇంద్ర అప్పట్లో రికార్డ్ సృష్టించింది. ఇంద్ర సినిమాకు బెస్ట్ యాక్టర్‌గా నంది అవార్డుతో పాటు ఫిల్మ్‌ఫేర్ అవార్డును చిరంజీవి అందుకున్నాడు. మొత్తంగా ఈ సినిమా మూడు నంది అవార్డులను గెలుచుకున్నది.
డ్యూయల్ షేడ్ క్యారెక్టర్…
ఇంద్రలో ఇంద్రసేనారెడ్డి, శంకర్‌నారాయణగా డ్యూయల్ షేడ్ క్యారెక్టర్‌లో చిరంజీవి అద్భుతమైన నటనను కనబరిచాడు. ఆయన పవర్‌ఫుల్ డైలాగ్స్, కామెడీ టైమింగ్ అభిమానులను మెప్పించాయి. ఇంద్ర సినిమాలో చిరంజీవికి జోడీగా ఆర్తి అగర్వాల్, సోనాలీ బింద్రె హీరోయిన్లుగా నటించారు. శివాజీ కీలక పాత్ర పోషించాడు. ఇంద్ర సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందించాడు. పాటలు కూడా మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకున్నాయి. ఇందులోని అయ్యో అయ్యాయ్యో అనే ఒక్క పాటకు మాత్రం ఆర్‌పీ పట్నాయక్ సంగీతాన్ని అందించడం గమనార్హం. ఇంద్ర సినిమాను తమిళ, హిందీ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈ సినిమా వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మించాడు.
టాపిక్