Ramoji Film City : రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రమాదం – కార్పొరేట్ కంపెనీ సీఈవో మృతి

Best Web Hosting Provider In India 2024

Vistex Company CEO Dead in Ramoji Film City : రంగారెడ్డి జిల్లా పరిధిలోని రామోజీ ఫిల్మ్‎సిటీలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విస్టెక్స్ అనే కంపెనీ సీఈఓ ప్రాణాలు కోల్పోయాడు. అంతేకాకుండా ఈ కంపెనీ ఛైర్మన్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు

కుప్పకూలిన వేదిక….

గురువారం సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా విస్టెక్స్ కంపెనీ సిల్వర్ జూబ్లీ కార్యక్రమం జరిగింది. ఇందుకు అమెరికాలో ఉంటున్న కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ సంజయ్ షా హాజరయ్యారు. ఆయనే కాకుండా కంపెనీకి చెందిన పలువురు ముఖ్యులు ఈవెంట్ లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా… కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన సెట్ పైకి క్రేన్‌ ద్వారా గెస్టులను కిందకు దించుతుండగా వైర్లు తెగిపోయాయి. దీంతో పలువురు కంపెనీ ప్రతినిధులు కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో సీఈవో సంజయ్ షా తీవ్రంగా గాయపడగా.. ఆయన్ను మలక్ పేటలోని యశోదా ఆస్పత్రికి తరలించారు.చికిత్స పొందుతున్న క్రమంలో ఇవాళ ఉదయం ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. ఇక ఈ ప్రమాదంలో కంపెనీ ఛైర్మన్ విశ్వనాథ్ రాజ్ తీవ్రంగా గాయపడగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న అబ్దుల్లాపూర్ మెంట్ పోలీసులు… ఘటనాస్థలికి చేరుకున్నారు. జానకీరామ్ అనే ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

WhatsApp channel
 

టాపిక్

 
Crime NewsTelangana NewsHyderabad

Source / Credits

Best Web Hosting Provider In India 2024