Rajinikanth: మతాలు ఉన్నది అందుకే: రజినీకాంత్

Best Web Hosting Provider In India 2024

Rajinikanth: కోలీవుడ్ మూవీ ‘లాల్ సలాం’ విడుదలకు రెడీ అవుతోంది. తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ కీలకపాత్ర పోషించిన ఈ చిత్రం ఫిబ్రవరి 9వ తేదీన రిలీజ్ కానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలవుతుంది. సుదీర్ఘ విరామం తర్వాత రజినీ కూతురు ఐశ్వర్య ఈ మూవీకి దర్శకత్వం వహించారు. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషించారు. క్రికెట్ డ్రామాగాా రానున్న లాల్ సలాం చిత్రంలో.. మతం అనే అంశం కూడా ప్రధానంగా ఉండనుంది. ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ గ్రాండ్‍గా జరిగింది. రజినీకాంత్ ఈ కార్యక్రమంలో పలు అంశాలపై మాట్లాడారు.

ట్రెండింగ్ వార్తలు

మతం అంశంపై ఈ ఈవెంట్‍లో రజినీకాంత్ మాట్లాడారు. దేవుడి గురించి మానవులు అర్థం చేసుకునేందుకు, తమలోనే దేవుడు ఉన్నాడని గుర్తించేందుకు, ప్రశాంతంగా జీవించేందుకే అన్ని మతాలు ఉన్నాయని రజినీ చెప్పారు. అయితే, కొందరు వ్యక్తులు తప్పుడు అర్థాలను చెప్పడం వల్ల సంఘర్షణలకు కారణం అవుతోందని ఆయన అన్నారు. మతసామరస్యంపై సందేశం ఇచ్చేందుకే తాను లాల్ సలాం మూవీలో భాగమయ్యేందుకు నిర్ణయించుకున్నానని రజినీ అన్నారు.

“దేవుడిని అర్థం చేసుకోవడంలో సహకరించేందుకు, దేవుడు తమలోనే ఉన్నాడని గుర్తించేందుకు అన్ని మతాల సృష్టి జరిగింది. దేవుడి గురించి తెలుసుకోవడం వేరు.. అర్థం చేసుకోవడం వేరు.. గ్రహించడం వేరు” అని రజినీకాంత్ అన్నారు. అన్ని మతాలు కూడా మానవత్వానికి లాభం చేకూర్చేలా ఉంటాయని చెప్పారు. అయితే కొందరి అసంబద్ధ భాష్యాలే గొడవలకు కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.

కొందరు తామే గొప్ప అని వాదిస్తూనే ఉన్నారని, అందుకే ప్రస్తుతం ఇబ్బందులు తలెత్తుతున్నాయని రజినీకాంత్ చెప్పారు. అందరూ మతసామరస్యం పాటించాలని ఆయన అన్నారు.

ఇష్టమైన దారిలో వెళ్లొచ్చు

ఎవరైనా వారికి ఇష్టమైన మతంలో ముందుకు సాగవచ్చని రజినీకాంత్ అన్నారు. “చాలా మతాలు వస్తుంటాయి.. పోతుంటాయని రామకృష్ణ పరమహంస చెప్పారు. కానీ న్యాయం, సత్యం, నిజాయితీ ఉన్న మతాలు శతాబ్దాలైనా కొనసాగుతూనే ఉంటాయి. క్రిస్టియానిటీ, ఇస్లాం, బుద్ధిజం, హిందూయిజాల్లో ఈ క్వాలిటీలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ప్రతికూలతలు ఎదురైనా దృఢంగా నిలబడ్డాయి. అందరూ ఇతరులతో కలిసి వారి దారిలో సాగవచ్చు” అని రజినీకాంత్ చెప్పారు. ఎవరు ఏ మతంలో ఉన్నా.. అందరూ ఐక్యతతో ముందుకు సాగాలని సందేశం ఇచ్చారు రజినీకాంత్.

లాల్ సలాం గురించి..

లాల్ సలాం మూవీలో మొయిద్దీన్ భాయ్ అనే ముస్లిం మత పెద్ద పాత్ర చేశారు రజినీకాంత్. విష్ణు విశాల్, విక్రాంత్‍తో పాటు ధన్యబాలకృష్ణన్, జీవిత రాజశేఖర్, విఘ్నేశ్, సెంథిల్, అనంతిక సనిల్‍కుమార్, కేఎస్ రవికుమార్ కీలకపాత్రల్లో నటించారు. భారత మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ కూడా క్యామియో రోల్‍ చేశారు.

లాల్ సలాం చిత్రానికి ఆస్కార్ పురస్కార విజేత ఏఆర్ రహమాన్ ఈ మ్యాజిక్ అందించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ మూవీని ప్రొడ్యూజ్ చేశారు. ఫిబ్రవరి 9న ఈ మూవీ రిలీజ్ కానుంది. క్రికెట్, మతకలహాలు ప్రధాన అంశంగా సాగే స్పోర్ట్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రంగా ఉండనుందని తెలుస్తోంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024