Best Web Hosting Provider In India 2024
Oil free Mutton curry: ఏ నాన్ వెజ్ కర్రీ చూసినా పైన నూనె తేలుతూ ఉంటుంది. అందుకే ఎక్కువమంది ఫిట్నెస్ ఫ్రీక్స్, బరువు తగ్గాలనుకునేవారు… నూనె ఉన్న ఆహారాలను తినడానికి ఇష్టపడరు. నూనె ఎక్కువగా తింటే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంది. ఇక్కడ మేము నూనె అవసరమే లేని మటన్ కర్రీని ఎలా వండాలో చెప్పాము. ఈ మటన్ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. నూనె వేయకుండా మటన్ గ్రేవీ రుచిగా ఉంటుందా అనే సందేహం రావచ్చు. అలాంటి సందేహం పెట్టుకోకండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ మీరే వండుకుంటారు.
ట్రెండింగ్ వార్తలు
నూనె లేని మటన్ కర్రీ కావలసిన పదార్థాలు
మటన్ – అరకిలో
ఉల్లిపాయలు – రెండు
టమాటోలు – రెండు
అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక స్పూను
కారం – ఒక స్పూను
పసుపు – అర స్పూను
ధనియాల పొడి – ఒక స్పూను
జీలకర్ర పొడి – ఒక స్పూను
గరం మసాలా – అర స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
నీరు – తగినంత
కొత్తిమీర తరుగు – నాలుగు స్పూన్లు
నూనె వేయకుండా మటన్ కర్రీ రెసిపీ
1. మటన్ ముక్కలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి.
2. ఆ గిన్నెలో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.
3. దాన్ని ఓ గంట పాటు మ్యారినేట్ చేయాలి.
4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి అందులో మటన్ మ్యారినేట్ చేసిన మటన్ ముక్కలను వేసి చిన్న మంట మీద ఉడికించాలి.
5. అందులోంచి నీరు దిగుతూ మటన్ ముక్కలు కాస్త గోధుమ రంగులోకి మారుతాయి.
6. అప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి బాగా వేయించాలి.
7. ఉల్లిపాయలు మటన్ ముక్కల్లో కలిసి బాగా వేగుతున్నప్పుడు టమోటో ప్యూరిని వేసి వేయించండి.
8. చిన్న మంట మీద ఉడికిస్తే ఇవి అడుగునా అంటుకోకుండా ఉడుకుతాయి.
9. అడుగున అంటుతున్నట్టు అనిపిస్తే కొంచెం నీరు పోస్తూ ఉండండి.
10. ఇలా మటన్ మెత్తబడే వరకు చిన్న మంట మీద ఉడికించండి. కాసేపటికి అది గ్రేవీలా ఉడుకుతుంది.
11. పైన కాస్త గరం మసాలా చల్లి, కొత్తిమీర ఆకులతో గార్నిష్ చేయండి.
12. మటన్ ముక్క ఉడికిన తర్వాత స్టవ్ కట్టేయండి. అంతే నూనె లేకుండా మటన్ గ్రేవీ కూర రెడీ అయినట్టే. ఇందులో నూనె వేయలేదు కాబట్టి ఎవరు తిన్నా ఆరోగ్యకరమే.
మటన్ వారానికి ఒకసారి తింటే ఎంతో మంచిది. దీనిలో విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి3, విటమిన్ బి9, విటమిన్ కే, విటమిన్ E అధికంగా ఉంటాయి. ముఖ్యంగా గర్భిణులు మటన్ తినాలి. అలా తినడం వల్ల పుట్టబోయే బిడ్డల్లో న్యూరల్ ట్యూబ్ సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే మటన్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలకు, దంతాలకు బలాన్ని ఇస్తుంది. ఈ మటన్ లో ఉండే పోషకాలు మన శరీరానికి అత్యవసరమైనవి. ఇందులో ఉండే సంతృప్త కొవ్వులు గుండెకు మేలు చేస్తాయి. అయితే అతిగా తింటే మాత్రం అనర్థం తప్పదు. మటన్ అధికంగా తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి వారానికి ఒకటి లేదా రెండు సార్లు తినేందుకు ప్రయత్నించండి. కేవలం 100 గ్రాముల కన్నా ఎక్కువ మటన్ ముక్కలు తినకపోవడం మంచిది.
టాపిక్