Best Web Hosting Provider In India 2024
Cameraman Gangatho Rambabu Re Release: 2012 సంవతర్సంలో డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సినిమా కెమెరామెన్ గంగతో రాంబాబు. ఇటీవల ఫిబ్రవరి 7న కెమెరామెన్ గంగతో రాంబాబు మూవీ రీరిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా రీరిలీజ్ అయిన ఓ థియేటర్లో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ బీభత్సం సృష్టించారు. ఏకంగా థియేటర్‌ను దాదాపు తగలబెట్టినంత పని చేశారు.
ట్రెండింగ్ వార్తలు
ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలలోని ఓ థియేటర్లో పవన్ కల్యాణ్ కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా రీరిలీజ్ అయింది. దీంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తెగ హడావిడి చేశారు. అలాగే కాగితాలు చింపి థియేటర్ స్క్రీన్‌పై విసురుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పటివరకు అంతా బాగానే ఉంది. కానీ, వారిలో కొంతమంది అభిమానులు మాత్రం మరి అత్యుత్సాహం ప్రదర్శించారు. పవన్ కల్యాణ్ స్క్రీన్‌పై కనిపించగానే పూనకం వచ్చి ఊగిపోయారు.
ఆ పూనకంలో కాగితాలను అన్నింటిని పేర్చి కాల్చారు. భోగిమంటలు పేర్చినట్లుగా పేర్చి మంట పెట్టారు. అంతేకాకుండా దాని చుట్టూ తిరుగుతూ, ప్లకార్డ్స్ పట్టుకుని నానా రచ్చ చేశారు. థియేటర్లో నిప్పు రవ్వలు గాలికి ఎగురుతూ పడుతుంటే.. ఫ్యాన్స్ మాత్రం కేకలు పెడుతూ, జై పవన్ కల్యాణ్ అంటూ సంతోషంలో మునిగిపోయారు. ఆ సమయంలో థియేటర్ అంతా జనం ఉన్నారు. అయితే, థియేటర్ యాజమాన్యం వెంటనే స్పందించి ఆ మంటలు ఆర్పేశారు. లేకుంటే చాలా నష్టం జరిగేదని తెలుస్తోంది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. దీనిపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కాగా పవన్ అభిమానులపై థియేటర్ యాజమాన్యం ఫిర్యాదు చేసిందో.. వారిని అరెస్ట్ చేశారా వంటి విషయాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అభిమానం పేరుతో ఇలా రచ్చ చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి చర్యలు చాలా చేశారు. 2021లో పవన్ కల్యాణ్ నటించిన ఓ సినిమా సాంకేతిక లోపంతో థియేటర్లో ఆగిపోయింది. దాంతో జోగులాంబ గద్వాలలోని ఓ థియేటర్‌ను ధ్వంసం చేశారు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్.
2023లో కొందరు అభిమానులు మద్యం మత్తులో విజయవాడలోని ఓ థియేటర్‌ను ధ్వంసం చేయగా పోలీసులు వారిని అరెస్టు చేసి, మరికొందరికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇది బ్రో సినిమా సమయంలో అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ నటించిన చిత్రాల్లో కెమెరామెన్ గంగతో రాంబాబు ఒకటి స్పెషల్‌గా ఉండిపోతుంది. ఎందుకంటే ఈ సినిమాకు డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించడమే.
గతంలో పవన్ కల్యాణ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన బద్రి సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనేసరికి స్పెషల్ మాత్రమే కాకుండా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 2012 అక్టోబర్ 18న థియేటర్లలో విడుదలైన కెమెరామెన్ గంగతో రాంబాబు యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో పవన్‌కు జోడీగా తమన్నా హీరోయిన్గా నటించింది. ప్రకాశ్ రాజ్, అలీ, కోట శ్రీనివాస్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, ఎమ్ఎస్ నారాయణ పలు పాత్రలు పోషించారు.
పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాలతోపాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను పవన్ కల్యాణ్‌కు సాలిడ్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక హరిహర వీరమల్లు మూవీని క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేశారు. కానీ, ఇటీవల ఆయన సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓజీని సుజీత్ డైరెక్ట్ చేస్తున్నాడు.
టాపిక్