Best Web Hosting Provider In India 2024
Telangana Budget 2024 -2025 Updates: రాష్ట్ర శాసనసభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క… మధ్యాహ్నం 12 తర్వాత పద్దును సభ ముందు ఉంచారు. శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక… తొలిసారిగా బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన భట్టి…. సమాన్వతమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గుణాత్మక మార్పు తీసుకురావటమే లక్ష్యంగా మా ప్రభుత్వం ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఎలాంటి త్యాగాలకైనా సర్కార్ సిద్ధంగా ఉంటుందని… ప్రజాసంక్షేమమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సోనియాగాంధీకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నామని చెప్పారు.
ట్రెండింగ్ వార్తలు
గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవాలకు విరుద్ధంగా ఉందన్నారు భట్టి విక్రమార్క. కానీ తమ ప్రభుత్వం అలా కాకుండా… వాస్తవాలను ప్రతిబింబించేలా రూపొందించామని స్పష్టం చేశారు. దళితబంధుకు నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు కానీ… ఖర్చు చేయలేదని గుర్తు చేశారు. ఈ సందర్భంగా పలు పథకాల వివరాలను సభ ముందు ఉంచారు భట్టి విక్రమార్క. రూ.2,75,891 కోట్లతో తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కేటాయింపుల వివరాలను వివరించారు.
తెలంగాణ బడ్జెట్ 2024- 2025:
రూ.2,75,891 కోట్లతో తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్(2024- 2025:).
రెవెన్యూ వ్యయం -2,01,178 కోట్లు.
మూల ధన వ్యయం – 29,669 కోట్లు.
ఆరు గ్యారెంటీల కోసం – రూ.53,196 కోట్లు అంచనా.
మూసీ ప్రాజెక్టుకు – రూ. 1000 కోట్లు కేటాయింపు.
టాపిక్