Telangana Budget 2024 : త్వరలోనే రుణమాఫీ విధివిధానాలు – రైతు భరోసాపై బడ్జెట్ లో కీలక ప్రకటన, శాఖలవారీగా కేటాయింపులు ఇవే

Best Web Hosting Provider In India 2024

Telangana Vote On Account Budget 2024 -2025 : రూ.2 లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామన్నారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. శనివారం అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్దెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడిన ఆయన… రుణమాఫీ విధివిధానాలను త్వరలోనే ఖరారు చేయబోతున్నామని చెప్పారు. రూ. 2 లక్షలలోపు రుణాలను మాఫీ చేస్తామని తెలిపారు. రైతుబంధు మంచి పథకమే అయినప్పటికీ… సాగు చేయనివారికి కూడా డబ్బులు ఇవ్వటం సరికాదని అభిప్రాయపడ్డారు. రైతుబంధు నిబంధనలను సవరిస్తామని ప్రకటిస్తున్నానని చెప్పారు. రైతుభరోసా కింద పంటపెట్టుబడి సాయం అందజేస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో నకిలీ విత్తనాల సమస్య ఉండేదని… అలాంటి వాటికి అవకాశం లేకుండా తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని భట్టి స్పష్టం చేశారు. ధరణి పోర్టల్ లో పూర్తిస్థాయిలో మార్పులు చేసి… అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అడుగులు వేస్తున్నామని భట్టి ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు

తెలంగాణ రాష్ట్ర 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కేటాయింపులు…

మొత్తం బడ్జెట్ 2,75,891కోట్లు.

ఆరు గ్యారెంటీల కోసం 53196 కోట్లు అంచనా.

పరిశ్రమల శాఖ 2543 కోట్లు.

ఐటి శాఖకు 774కోట్లు.

పంచాయతీ రాజ్ 40,080 కోట్లు.

పురపాలక శాఖకు 11692 కోట్లు.

మూసీ రివర్ ఫ్రాంట్ కు వెయ్యి కోట్లు.

వ్యవసాయ శాఖ 19746 కోట్లు.

ఎస్సి, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం 1250 కోట్లు.

ఎస్సి సంక్షేమం 21874 కోట్లు.

ఎస్టీ సంక్షేమం 13013 కోట్లు.

మైనార్టీ సంక్షేమం 2262 కోట్లు.

బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం 1546 కోట్లు.

బీసీ సంక్షేమం 8 వేల కోట్లు.

విద్యా రంగానికి 21389 కోట్లు.

తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు 500 కోట్లు.

యూనివర్సిటీల్లో సదుపాయాలకు 500 కోట్లు.

వైద్య రంగానికి 11500 కోట్లు.

విద్యుత్ – గృహ జ్యోతికి 2418 కోట్లు.

విద్యుత్ సంస్థలకు 16825 కోట్లు.

గృహ నిర్మాణానికి 7740 కోట్లు.

నీటి పారుదల శాఖ కు 28024 కోట్లు.

WhatsApp channel

టాపిక్

Budget 2024Telangana NewsTelangana CongressCrop LossCm Revanth ReddyMallu Bhatti Vikramarka
Source / Credits

Best Web Hosting Provider In India 2024