YSRCP Nandigama : పట్టణంలోని 4 వ వార్డులో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం” ..

YSRCP Nandigama :

 

 

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.23-11-2022(బుధవారం) ..

నందిగామ పట్టణాభివృద్ధికి విశేష కృషి ..

పట్టణంలోని 4 వ వార్డులో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం”లో భాగంగా సంక్షేమ పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

నందిగామ పట్టణంలోని 4 వ వార్డు పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ – ప్రజల సమస్యలను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు అడిగి తెలుసుకున్నారు ..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి సహకారంతో పట్టణ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నామని , ముఖ్యంగా పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థపై దృష్టి సారించి రూ.15 కోట్లతో డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టడం జరిగిందని తెలిపారు , అదేవిధంగా పట్టణంలో సిసి రోడ్ల నిర్మాణాలతో పాటు కాలనీలలో ఉన్న మట్టి రోడ్ల అభివృద్ధికి గ్రావెల్ తో రోడ్ల అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు , పట్టణంలో ప్రజల సౌలభ్యం కోసం నూతనంగా నిర్మించిన అర్బన్ హెల్త్ క్లినిక్ ల నిర్మాణం పూర్తయిందని త్వరలోనే వాటి ప్రారంభోత్సవం కూడా చేస్తామన్నారు , అదేవిధంగా వార్డులలో తాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక దృష్టిసారించి తాగునీటి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు , గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజలు తెలిపిన సమస్యలను కూడా ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టామన్నారు ,

ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ డాక్టర్ జయరామ్ , కౌన్సిలర్ మారం అమరయ్య ,కౌన్సిల్ సభ్యులు ,కోఆప్షన్ సభ్యులు ,ఏఈ ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,సచివాలయ సిబ్బంది , వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు ..

Follow us : Facebook,Twitter,Instagram

#ysrcp_nandigama

#mla_nandigama

#jagan_mohan_rao_monditoka

#mlc_nandigama

#arun_kumar_monditoka

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *