YSRCP Nandigama :
నందిగామ నగర పంచాయతి పరిధిలో గల అనాసాగరం లేఅవుట్ స్థలములో లబ్దిదారులతో జరుగుచున్న ఇళ్ల నిర్మాణాలను ది.23-11-2022 వతేదీన బుధవారంనాడు గౌ|| శాసన సభ్యులు డా.మొండితోక జగన్ మోహనరావు గారు పరిశీలించారు. అనంతరం లేఔట్ల వద్ద లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం ఎటువంటి ఇబ్బందులు లేకుండా లే అవుట్ అన్నీ రకాల మౌళిక సదుపాయాలు కల్పించడం జరిగినదని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని, అసౌకర్యం కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమములో మున్సిపల్ కమిషనర్ డాక్టర్ జయరాం మరియు హౌసింగ్ డిఇ వీరభద్రరావు, వార్డు కౌన్సిలర్లు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.