YSRCP Nandigama : పట్టణంలోని 4 వ వార్డులో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం”..

YSRCP Nandigama :

 

 

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.24-11-2022(గురువారం) ..

భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని సీఎం వైయస్ జగన్ పాలన ..

పట్టణంలోని 4 వ వార్డులో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం”లో భాగంగా సంక్షేమ పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

నందిగామ పట్టణంలోని 4 వ వార్డు పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ – ప్రజల సమస్యలను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు అడిగి తెలుసుకున్నారు ..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని పాలన చేస్తున్నారని , ప్రజలకు మంచి చేయాలని సదుద్దేశంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారని తెలిపారు , ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల తో పాటు అగ్రవర్ణ మహిళలకు సైతం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో లబ్ధి చేకూరుస్తున్నారని గుర్తు చేశారు , పట్టణాలు, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నారని చెప్పారు ..

ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ డాక్టర్ జయరామ్ , కౌన్సిలర్ మారం అమరయ్య , చల్లా బ్రహ్మం ,మహమ్మద్ మస్తాన్ , మండవ పిచ్చయ్య ,దొంతిరెడ్డి దేవేందర్ రెడ్డి , పాములపాటి రమేష్ ,గుడివాడ సాంబశివరావు , దాసు, జాఫర్ , కిరణ్ , నల్లమల్లి మురళి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,సచివాలయ సిబ్బంది , వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *