Hanuman vs Sri Anjaneyam: హ‌నుమాన్ కంటే శ్రీ అంజ‌నేయం బెట‌ర్ – కృష్ణ‌వంశీ ఇంట్రెస్టింగ్ ఆన్స‌ర్‌

Best Web Hosting Provider In India 2024

Hanuman vs Sri Anjaneyam: తేజా స‌జ్జా హీరోగా ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన హ‌నుమాన్ మూవీ క‌లెక్ష‌న్స్ ప‌రంగా బాలీవుడ్ రికార్డుల‌ను తిర‌గ‌రాస్తోంది. 30 రోజుల్లో మూడు వంద‌ల కోట్ల వ‌సూళ్ల‌ను రాబ్ట‌టింది. సంక్రాంతి విన్న‌ర్‌గా నిలిచింది. హిందీలో నెల రోజుల్లోనే హ‌నుమాన్ మూవీకి 50.72 కోట్ల క‌లెక్ష‌న్స్ వ‌చ్చిన‌ట్లు ట్రేడ్ అన‌లిస్ట్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ట్వీట్ చేశారు. హిందీలో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన సౌత్ డ‌బ్బింగ్ మూవీస్‌లో ఒక‌టిగా హ‌నుమాన్ రికార్డ్ క్రియేట్ చేసింది. థియేట‌ర్ల‌లో రిలీజై నెల రోజులు దాటినా హ‌నుమాన్ క‌లెక్ష‌న్స్ జోరు మాత్రం త‌గ్గ‌డం లేదు.

ట్రెండింగ్ వార్తలు

హ‌నుమాన్ కంటే శ్రీ అంజ‌నేయం బెట‌ర్‌…

హ‌నుమాన్ మూవీపై ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన శ్రీ అంజ‌నేయం కూడా హ‌నుమంతుడి క‌థ‌తోనే తెర‌కెక్కింది. సామాన్యుడైన త‌న భ‌క్తుడికి హ‌నుమంతుడు ఎలా అండ‌గా నిలిచాడు అనే పాయింట్‌తో ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీ శ్రీ ఆంజ‌నేయం మూవీని తెర‌కెక్కించాడు. శ్రీఅంజ‌నేయం మూవీతో హ‌నుమాన్‌ను కంపేర్ చేశాడు ఓ నెటిజ‌న్‌. నాకు ఎందుకో తెలిదు హ‌నుమాన్ కంటే శ్రీ అంజ‌నేయం బాగా న‌చ్చింద‌ని అన్నాడు. కానీ జ‌నాల‌కు అర్థం కాలేద‌ని ట్వీట్ చేశాడు. ఆ నెటిజ‌న్ ట్వీట్‌పై కృష్ణ‌వంశీ రియాక్ట్ అయ్యాడు.

ఆడియెన్స్ త‌ప్పు కాదు…

శ్రీ ఆంజ‌నేయం ఆడియెన్స్‌కు న‌చ్చ‌లేదంటే సినిమాలో ఏదో త‌ప్పు ఉంద‌ని కృష్ణ వంశీ అన్నాడు. ఆ త‌ప్పు వ‌ల్లే సినిమా ప్రేక్ష‌కుల‌కు రీచ్ కాలేద‌ని తెలిపాడు. శ్రీ ఆంజ‌నేయం సినిమాలోని కొన్ని పోర్ష‌న్స్ ను తెర‌కెక్కించే విష‌యంలో తాను పొర‌పాట్లు చేసిన‌ట్లు కృష్ణ‌వంశీ ఈ ట్వీట్‌లో పేర్కొన్నాడు. త‌న త‌ప్పుల‌కు ఆడియెన్స్‌ను బ్లేమ్ చేయ‌డం క‌రెక్ట్ కాద‌ని, వారు ఎప్పుడు క‌రెక్ట్‌గానే ఉంటార‌ని కృష్ణ వంశీ అన్నాడు. నెటిజ‌న్ ట్వీట్‌కు కృష్ణ ఇచ్చిన స‌మాధానం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

2004లో రిలీజ్‌..

2004లో రిలీజైన శ్రీ అంజ‌నేయం సినిమాలో నితిన్‌, ఛార్మి హీరోహీరోయిన్లుగా న‌టించారు. శ్రీ అంజేయం సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూనే స్వ‌యంగా కృష్ణ‌వంశీ ఈ మూవీని ప్రొడ్యూస్ చేశాడు. హ‌నుమంతుడిగా సీనియ‌ర్ హీరో అర్జున్ క‌నిపించాడు. దాదాపు ప‌ది కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ మూవీ ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోయింది. హీరోహీరోయిన్ల ల‌వ్ ట్రాక్ కార‌ణంగానే ఈ సినిమా ఫెయిలైన‌ట్లు అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది.

సూప‌ర్ హీరో క‌థ‌తో…

కాగా హ‌నుమాన్ మూవీలో తేజాస‌జ్జాకు జోడీగా అమృత అయ్య‌ర్ హీరోయిన్‌గా న‌టించింది. అంజ‌నాద్రి అనే ఫిక్ష‌న‌ల్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సూప‌ర్ హీరో క‌థాంశంతో ప్ర‌శాంత్ వ‌ర్మ ఈ సినిమాను తెర‌కెక్కించాడు. అంజ‌నాద్రి ప్ర‌జ‌ల‌ను ఇబ్బందుల‌ను పెడుతోన్న పాలెగాళ్ల అన్యాయాల‌ను హ‌నుమంతు ఎలా ఎదురించాడు.

రుధిర‌మ‌ణి కార‌ణంగా అత‌డికి ఎలాంటి సూప‌ర్ ప‌వ‌ర్స్ వ‌చ్చాయి? ఆ రుధిర‌మ‌ణిని హ‌నుమంతు నుంచి సొంతం చేసుకునేందుకు మైఖేల్ ఎలాంటి కుట్ర‌లు ప‌న్నాడు? అన్న‌దే ఈ మూవీ క‌థ‌. హ‌నుమాన్‌లో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, విన‌య్ రాయ్ కీల‌క పాత్ర‌లు పోషించారు. హ‌నుమాన్‌కు సీక్వెల్ తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు ప్ర‌శాంత్ వ‌ర్మ ప్ర‌క‌టించాడు. ఈ సీక్వెల్‌కు జై హ‌నుమాన్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024