YSRCPNandigama :
ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.25-11-2022(శుక్రవారం) ..
రాజకీయ భేదాలు చూడకుండా ,అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు ..
పట్టణంలోని 4 వ వార్డులో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం”లో భాగంగా సంక్షేమ పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ పట్టణంలోని 4 వ వార్డు పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ – ప్రజల సమస్యలను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు అడిగి తెలుసుకున్నారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి సంక్షేమ పథకాలు నిరంతర ప్రక్రియలా సాగుతున్నాయని ,గతంలో ఏ ప్రభుత్వంలో లేని విధంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు , కుల మత వర్గ రాజకీయ భేదాలు చూడకుండా అర్హతే ప్రామాణికంగా పథకాలను అందిస్తున్నారని గుర్తు చేశారు , ప్రజల సమస్యలు -అవసరాలు గుర్తెరిగి పరిష్కరించే దిశగా పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు , మంచి చేస్తున్న ప్రభుత్వానికి -ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు అండగా నిలిచి ఆశీర్వదించాలని కోరారు ..
ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ డాక్టర్ జయరాం, ఏఈ ఫణి శ్రీనివాస్ , కౌన్సిలర్ మారం అమరయ్య ,చల్లా బ్రహ్మం ,మహమ్మద్ మస్తాన్ , మండవ పిచ్చయ్య , దొంతిరెడ్డి దేవేందర్ రెడ్డి, దాసు, జాఫర్ ,నల్లమల్లి మురళి ,పరిసే మల్లి ,బండారు వెంకటరావు ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,సచివాలయ సిబ్బంది , వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు ..