Best Web Hosting Provider In India 2024
Janasena Vs Ysrcp : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటన వాయిదా పడింది. పవన్ హెలీకాఫ్టర్ల్ ల్యాండింగ్(Pawan Helicopter) కు అధికారులు అనుమతి నిరాకరించడంతో పవన్ తన పర్యటన వాయిదా(Pawan Kalyan Tour) వేసుకున్నారు. హెలీకాఫ్టర్ దిగేందుకు అనుమతులు ఇవ్వకుండా ఆర్ అండ్ బీ అధికారులపై అధికార వైసీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. హెలీకాఫ్టర్ కు అనుమతులు నిరాకరించడంపై హైకోర్టును ఆశ్రయించాలని పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జనసేన(Janasena) లీగల్ సెల్ కు ఆయన ఆదేశాలు ఇచ్చారని సమాచారం. అయితే భీమవరం(Bhiamavaram), అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరంలో పవన్ కల్యాణ్ పలు సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంది. పర్యటన వాయిదాతో మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలోనే నేతలతో పవన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. భీమవరంలోని విష్ణు ఇంజినీరింగ్ కాలేజీలో హెలీప్యాడ్ వద్ద పవన్ హెలీకాఫ్టర్ దిగేందుకు కళాశాల యాజమాన్యం అనుమతి ఇచ్చినా… అక్కడ ల్యాండింగ్ కు అనువుగా లేదని అధికారులు అనుమతి నిరాకరించారు.
ట్రెండింగ్ వార్తలు
ఎక్స్ లో జనసేన వర్సెస్ వైసీపీ
పవన్ హెలీకాఫ్టర్ల్ ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వకపోడవంపై వైసీపీపై జనసేన తీవ్ర విమర్శలు చేస్తుంది. ఎక్స్ వేదికగా జనసేన(Janasena), వైసీపీ(Ysrcp) మధ్య ట్వీట్ల వార్ జరుగుతోంది. రాష్ట్రంలో పవన్ కల్యాణ్ ఏ ప్రాంతానికైనా రోడ్డు మీద వచ్చినా, హెలీకాఫ్టర్ లో వస్తా అన్నా వైసీపీ ప్రభుత్వం పదే పదే అడ్డుకుంటుందని ఆరోపించింది. వైసీపీ పాలనను జనసేనాని ముగిస్తారన్న భయంతో ఇలా చేస్తు్న్నారని విమర్శించింది. జగన్ ఇంత పిరికోడివి ఏంటి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నీ సిద్దం పెద్ద అబద్ధం అంటూ ట్వీట్ చేసింది. మాజీ రాష్ట్రపతి కలాం, వెంకయ్య నాయుడు, గతంలో పవన్ కల్యాణ్ ల్యాండ్ అయిన విష్ణు కాలేజీలోనే ల్యాండింగ్ కు అనుకూలంగా లేదని పర్మిషన్ నిరాకరించడం హాస్యాస్పదమని జనసేన నేతలు మండిపడుతున్నారు. జనసేన ఆరోపణలకు వైసీపీ కౌంటర్ ఇచ్చింది.
వైసీపీ కౌంటర్
మనసుంటే మార్గం ఉంటుందని, చంద్రబాబు(Chandrababu) కోసం రోడ్ల మీద దొర్లుకుంటూ వెళ్తారుగా…మీ పార్టీ సభకు రోడ్డు మార్గంలో రాలేరా పవన్ అంటూ వైసీపీ కౌంటర్ ఇచ్చింది. హెలీకాప్టర్ కి పర్మిషన్ లేకపోతే కారులో వెళ్లొచ్చు కదా? అంతేకానీ ఇలాంటి మంగళవారం కథలు చెప్పి డ్రామాలు వేస్తే మిమ్మల్ని మళ్లీ భీమవరంలో ప్రజలు బొందపెట్టడం ఖాయమని ట్వీట్ చేసింది. దీనికి జనసేన రివర్స్ కౌంటర్ ఇచ్చింది. మనసుంది కానీ మార్గం ఎక్కడుంది రోడ్ల నిండా గుంతలే కదా? అయినా పర్మిషన్ లు రద్దు చేస్తామని ఎంత నిస్సిగ్గుగా ఒప్పుకున్నారని విమర్శించింది.
సంబంధిత కథనం
టాపిక్