Best Web Hosting Provider In India 2024
Sasivadane Release Date: ‘పలాస 1978’ ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తోన్న శశివదనే మూవీ రిలీజ్ డేట్ ఫిక్సయింది.ప్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో రక్షిత్ అట్లూరి సరసన కోమలి ప్రసాద్ హీరోయిన్గా నటిస్తోంది. శశివదనే మూవీతో సాయి మోహన్ ఉబ్బన దర్శకుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్ వీ ఎస్ స్టూడియోస్ పతాకాలపై అహితేజ బెల్లంకొండ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
ట్రెండింగ్ వార్తలు
రిలీజ్ డేట్ ఇదే…
వాలెంటైన్స్ డే సందర్భంగా శశివదనే రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్‌చేశారు. ఏప్రిల్ 5న ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు ప్రకటించారు. ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పోస్టర్ మీద ఉన్న ‘మనసులో పుట్టే ప్రేమ మచ్చలేనిదైతే ఆ ప్రేమకు మరణం కూడా మనతోనే’ డైలాగ్ ఆసక్తిని పంచుతోంది. సినిమాథీమ్ మొత్తాన్ని ఈ డైలాగ్‌లోనే చూపించారు. స్వచ్చమైన గ్రామీణ ప్రేమ కథగా దర్శకుడు సాయిమోహన్ ఈ మూవీని తెరకెక్కుతోన్నట్లు తెలుస్తోంది.
ఇటీవల రిలీజైన శశివదనే టీజర్‌కు యూట్యూబ్‌లో మిలియన్‌కుపైగా వ్యూస్ వచ్చాయి. గడిచే కాలంలో ఈ నేలపై నడిచే నా ప్రతి అడుగు ఇకపై నీతోనే అంటూ శశివదనే టీజర్‌లోని డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీని కలిగించాయి. ఈ సినిమాలోని శశివదనే టైటిల్ సాంగ్‌తో పాటు డీజే పిల్లా పాటలను రిలీజ్ చేశారు.
మెయిన్ రోల్స్…
శశివదనే సినిమాలో రంగస్థలం మహేష్, శ్రీమాన్, జబర్దస్త్ బాబీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు శరవణ వాసుదేవన్ మ్యూజిక్ అందిస్తోండగా.. అనుదీప్ దేవ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను సమకూర్చుతున్నారు.
ఫ్యామిలీ స్టార్‌తో పాటుగా…
ఏప్రిల్ 5న ఎన్టీఆర్ దేవర రిలీజ్ కావాల్సింది. షూటింగ్‌తో పాటు పోస్ట్‌ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో దేవర రిలీజ్ వాయిదాపడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దేవర స్థానంలో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమాతో పాటుగా శశివదనే కూడా బాక్సాఫీస్ రేసులోకి వచ్చింది.
పలాస 1978 తర్వాత…
పలాస 1978తో హీరోగా తెలుగులో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు రక్షిత్ అట్లూరి. కుల వివక్షపై పోరాడే ఓ సామాన్యుడి పాత్రలో చక్కటి నటనను కనబరిచాడు. కమర్షియల్ పంథాకు భిన్నంగా సామాజిక అంశాలు మేళవించిన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. అతడు హీరోగా నటించిన నరకాసుర ఇటీవలే థియేటర్లలో రిలీజైంది. ప్రస్తుతం శశివదనేతో పాటు ఆపరేషన్ రావణ్ సినిమాలు చేస్తున్నాడు రక్షిత్ అట్లూరి.
హీరోయిన్‌గానే కాకుండా…
తెలుగులో హీరోయిన్ పాత్రలు చేస్తూనే మరోవైపు డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎంచుకుంటోంది కోమలి ప్రసాద్. అడివిశేష్ హీరోగా నటించిన హిట్ 2 మూవీలో ఓ కీలక పాత్ర పోషించింది. నెపోలియన్, అనుకున్నది ఒక్కటి అయింది ఒక్కటి, సెబాస్టియన్ పీసీ 524 సినిమాల్లో కోమలి ప్రసాద్ హీరోయిన్గా నటించింది. తెలుగులో లూజర్తో పాటు మోడ్రన్ లవ్ ఇన్ హైదరాబాద్ సిరీస్‌లలో కోమలి ప్రసాద్ నటనకు మంచి పేరు వచ్చింది. స్వతహాగా డాక్టర్ అయిన కోమలి ప్రసాద్ నటనపై ఇంట్రెస్ట్‌తో హీరోయిన్గా మారింది.