YSRCP Nandigama :
ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.27-11-2022(ఆదివారం) ..
పోతురాజుల కు నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
రైతన్నల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కృషి ..
నందిగామ పట్టణ శివారు అనాసాగరం గ్రామ రైతులు పంట కోతకు ముందు నిర్వహించుకునే పోతురాజులకు పాల పొంగళ్ళు సమర్పించే కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు పాల్గొని పోతురాజులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నదాతల సంక్షేమానికి కృషి చేస్తున్నారని , వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి రైతన్నలకు మేలు కలిగే విధంగా పలు సంక్షేమ పథకాలు -కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు ,వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో రైతన్నలంతా ఆనందంగా ఉన్నారని – సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాయని తద్వారా మంచి దిగుబడితో అన్నదాతలకు లాభాలు చేకూరాలని ఆకాంక్షిస్తున్నట్ట్లు తెలిపారు ..
ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మహమ్మద్ మస్తాన్ ,పాములపాటి రమేష్ ,కర్రీ రవీంద్ర , పాకాలపాటి కిరణ్, గుడివాడ సాంబశివరావు ,చాపల మల్లికార్జునరావు, కర్రీ రాము , పాములపాటి రాజారావు , కనగాల శంకర్రావు పలువురు గ్రామ రైతులు పాల్గొన్నారు ..