YSRCP NAndigama :
ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.28-11-2022(సోమవారం) ..
ఉచిత మెగా క్యాన్సర్ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో విజయవాడకు చెందిన అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత మెగా క్యాన్సర్ వైద్య శిబిరాన్ని శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు సోమవారం ప్రారంభించారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు స్వచ్ఛంద సంస్థలు మరియు దాతలు ఏర్పాటుచేసిన మెగా మెడికల్ క్యాంపులను ప్రజలు రోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు , ప్రజల వినియోగార్ధం ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ క్యాంప్ ఏర్పాటుచేసిన అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూషన్స్ శాసనసభ్యులు డాక్టర్ జగన్ మోహన్ రావు గారు అభినందించారు ,
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గుడివాడ సాంబశివరావు , సూపరిండెంట్ డాక్టర్ సీతారావమ్మ , పలువురు వైద్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..