Best Web Hosting Provider In India 2024
వైయస్ఆర్సీపీ నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త వి.విజయసాయిరెడ్డి
ప్రజలకిచ్చిన 99 శాతం హామీలను వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం అమలు చేసింది
అభివృద్ధిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థరహితం
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు
మరింత మెరుగైన పరిపాలన అందించేందుకు సీఎం వైయస్ జగన్ సిద్ధంగా ఉన్నారు
సిద్ధం సభ వేదికగా సీఎం జగన్ మేనిఫెస్టోలో ప్రకటిస్తారు..
పార్టీకి, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటాను. టికెట్ రాలేదని మంత్రి జయరాం టీడీపీలో చేరారు.
రాజీనామా చేసి టీడీపీ కండువా కప్పుకుంటే బాగుండేది
ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటల్లో విశ్వసనీయత లేదు: విజయసాయిరెడ్డి
నెల్లూరు: పుట్టి, పెరిగిన గడ్డ నెల్లూరులో పోటీ చేసి గెలిచి ప్రజలకు సేవ చేస్తానని వైయస్ఆర్సీపీ నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. పార్టీ అధినేత, సీఎం వైయస్ జగన్ ఆదేశాల మేరకు నెల్లూరు లోక్ సభ అభ్యర్థిగా బరిలో దిగుతున్నాను.. నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారయ్యారు అని విజయసాయి రెడ్డి తెలిపారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులై..మొదటిసారి నెల్లూరుకు వెళ్లిన విజయసాయిరెడ్డికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. భారీ ఊరేగింపు నిర్వహించారు.
ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 99 శాతం హామీలను వైయస్ జగన్ అమలు చేశారని తెలిపారు. ఎవరి హయాంలో అభివృద్ధి ఎక్కువ జరిగిందో ప్రజలకు బాగా తెలుసు.. అభివృద్ధిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు సరికావు.. మరోసారి వైయస్ఆర్ సీపీని గెలిపించుకునేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు.. మరింత మెరుగైన పరిపాలన అందించేందుకు వైయస్ జగన్ సిద్ధంగా ఉన్నారు అని ఆయన చెప్పారు. సిద్ధం సభా వేదికగా సీఎం వైయస్ జగన్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తారు.. ఇప్పటి వరకూ జరిగిన మూడు సిద్ధం మహా సభలు చరిత్రలో నిలిచిపోయేలా శ్రేణులు హాజరయ్యారు..
పుట్టి, పెరిగిన గడ్డపై పోటీ చేసి గెలిచి ప్రజలకు సేవ చేస్తాను అని వైసీపీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటల్లో విశ్వసనీయత లేదు.. ఆ మాటల వెనుక దురుద్దేశం ఉంది.. వేమిరెడ్డి నాకు మంచి మిత్రుడు.. రాజకీయం వేరు, స్నేహం వేరు అని అన్నారు. జిల్లా మీద నాకు పూర్తిగా అవగాహన ఉంది.. రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ జిల్లాను అభివృద్ధి చేశాను.. పార్టీకి, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటాను.. టికెట్ రాలేదని మంత్రి జయరాం టీడీపీలో చేరారు.. రాజీనామా చేసి టీడీపీ కండువా కప్పుకునివుంటే బాగుండేది అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.