Best Web Hosting Provider In India 2024
Nayanthara: నయనతార, విఘ్నేష్ శివన్ విడాకులు తీసుకోబోతున్నట్లు కోలీవుడ్‌లో కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవలే భర్త విఘ్నేష్ శివన్‌ను నయనతార ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడంతో ఈ విడాకుల వార్తలు తెరపైకి వచ్చాయి. గతంలో పలువురు సినీ తారలు విడాకుల తీసుకునేముందు ఒకరి సోషల్ మీడియా ఖాతాలను మరొకొరు అన్‌ఫాలో చేయడం లాంటివి జరిగాయి. ఆ తర్వాత జంటలు విడిపోయాయి. వారి బాటలోనే నయనతార, విఘ్నేష్ శివన్ కూడా అడుగులు వేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. వీరిద్దరు విడిపోనున్నట్లు కోలీవుడ్‌లో పుకార్లు షికారు చేశాయి. ఈ విడాకుల వార్తలు వైరల్ కాగానే మళ్లీ విఘ్నేష్ శివన్‌ను ఫాలో కావడం మొదలుపెట్టింది నయనతార.
ట్రెండింగ్ వార్తలు
పుకార్లకు చెక్…
విడాకుల వార్తలపై తమదైన శైలిలో ఈ జంట చెక్ పెట్టారు. ఇటీవలే ఓ ఫ్లూటిస్ట్ లైవ్ మ్యూజిక్‌ను భర్తతో కలిసి ఆస్వాదిస్తోన్న పాత వీడియోను నయన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో ఇద్దరు రొమాంటిక్‌గా కనిపించారు. తాజాగా శుక్రవారం విడాకులపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. నయనతార, విఘ్నేష్ శివన్ తమ కవల పిల్లలతో కలిసి సమ్మర్ వెకేషన్ కోసం ఫారిన్ టూర్ వె ళ్లారు. ఈ టూర్లో నయన్, విఘ్నేష్ శివన్‌తో పాటు వారి కవల పిల్లలు కూడా కనిపిస్తారు.
ఫొటోలు వైరల్…
నయనతారతో కలిసి టూర్‌కు వెళుతోన్న ఫొటోలను విఘ్నేష్ శివన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫొటోల్లో చిరునవ్వులు చిందిస్తూ నయన్, విఘ్నేష్ సంతోషంగా కనిపిస్తున్నారు. తమ కవల పిల్లలను చెరొకరు ఎత్తుకున్నారు. చాలా రోజుల తర్వాత పిల్లలతో కలిసి టూర్‌కు వెళుతోండటం ఆనందంగా ఉందంటూ ఈ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చాడు విఘ్నేష్ శివన్. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. ఈ ఫొటోలతో విడాకుల రూమర్లకు నయన్, విఘ్నేష్ పుల్‌స్టాప్ పెట్టారని అభిమానులు అంటున్నారు.
జవాన్‌తో బాలీవుడ్ ఎంట్రీ…
తమిళంలో నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. నయనతార. బాలీవుడ్ నుంచి ఆమెకు పలు అవకాశాలు వరిస్తున్నాయి. షారుఖ్‌ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమాతో గత ఏడాది బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది నయనతార. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ మూవీ 1100 కోట్ల వసూళ్లను రాబట్టింది. బాలీవుడ్ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇందులో టాస్క్‌ఫోర్స్ పోలీస్ ఆఫీసర్‌గా యాక్షన్ ఓరియెంటెడ్ రోల్లో నయనతార కనిపించింది.
గత ఏడాది తమిళంలో ఇరైవన్, అన్నపూర్ణి సినిమాలు చేసింది నయనతార. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్‌గా నిలిచాయి. వివాదాల కారణంగా అన్నపూర్ణి సినిమాను ఓటీటీ నుంచి తొలగించారు.
క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో
ప్రస్తుతం కోలీవుడ్‌లో క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న టెస్ట్‌తో పాటు మంగట్టి సినిమాలు చేస్తోంది. మరో రెండు సినిమాలకు ఇటీవలే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తమిళం, హిందీలో సినిమాలు చేస్తోన్న నయనతార టాలీవుడ్‌కు మాత్రం దూరంగా ఉంటోంది. మరోవైపు కాథు వకుల రెండు కాదల్ తర్వాత తన నెక్స్ట్ మూవీని విఘ్నేష్ శివన్ ఇప్పటివరకు ప్రకటించలేదు. అజిత్‌తో ఓ సినిమా అఫీషియల్‌గా అనౌన్స్‌చేసిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ మూవీ ఆగిపోయింది.