Remand Death: విజయవాడ సబ్‌ జైలులో రిమాండ్ ఖైదీ మృతి, డ్రంకెన్‌ డ్రైవ్‌లో అరెస్ట్.. నిత్యం తాగి జైలు పాలవుతున్న జనం…

Best Web Hosting Provider In India 2024

Remand Death: విజయవాడ సబ్‍జైలులో రిమాండ్ ఖైదీ Remand Prisoner మృతి చెందడం కలకలం రేపింది. రిమాండ్‌లో ఉన్న ఆటోడ్రైవర్ బాలగంగాధర్ తిలక్ మృతి చెందాడు. రెండు రోజుల క్రితం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఆటోడ్రైవర్ తిలక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయస్థానం Court జరిమానాతో పాటు జైలు శిక్ష విధించింది.

ట్రెండింగ్ వార్తలు

శుక్రవారం ఉదయం జైలు బ్యారక్‍లో స్పృహతప్పి పడి ఉన్న బాలగంగాధర్ తిలక్ నున సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఖైదీ మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. విజయవాడ పాతబస్తీకి గొల్లపాలెం గట్టుకు చెందిన తిలక్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. జైల్లో తిలక్ మృతి చెందడంపై కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

నిత్యం పెద్ద సంఖ్యలో జైలు శిక్షలు….

కొత్త రవాణా చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఏపీలో పోలీసులు పెద్ద ఎత్తున డ్రంకెన్ కేసులు నమోదు చేస్తున్నారు. విజయవాడలో సగటున రోజుకు 50 నుంచి 60 మందికి జైలు శిక్షలు విధిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే వాహనం రకం, సేవించిన మద్యం ఆధారంగా శిక్షలు ఖరారు చేస్తున్నారు. గత ఆర్నెల్లలో వేల మంది జైలు పాలయ్యారు. భారీ జరిమానాలు చెల్లించారు. కొత్త రవాణా చట్టాలపై ఏ మాత్రం అవగాహన చర్యలు చేపట్టకుండా టార్గెట్‌ పెట్టుకుని జైళ్లకు పంపుతున్నారనే విమర‌్శలు ఉన్నాయి.

ఫిబ్రవరి 29న

గత నెల 29వ తేదీన మద్యం సేవించి వాహనాలు నడిపిన 46 మంది వ్యక్తులకు న్యాయస్థానం జరిమానా విధించింది. 2ట్రాఫిక్, 4వ ట్రాఫిక్ పోలీసులు వివిధ ప్రాంతాల్లో 46 కేసులలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేశారు.

మద్యం సేవించి వాహనాలు నడిపే చోదకులను ఎనిమిదవ అడిషనల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్ట్ లో న్యాయమూర్తి విజయ్ కుమార్ రెడ్డి ఒక్కొక్కరికి రూ.10,000/- చొప్పున జరిమానా విధించారు.

1వ తేదీ 39 కేసులు…

మద్యం సేవించి వాహనాలు నడిపిన 39 మందికి విజయవాడ కోర్టు జరిమానా విధించింది. మద్యం సేవించి వాహనా నడిపే వారిపై నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో 39 కేసులు నమోదు చేశారు. వారిని ఆరవ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్ట్ లో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి జి.లెనిన్ బాబు గారు 09 మంది వ్యక్తులకు ఒకొక్కరికి రూ.15,000/- జరిమానా విధించారు. మిగిలిన 30 మందికి ఒక్కొక్కరికి రూ.10,000/- చొప్పున జరిమానా విధించారు.

4న 65 మందిపై కేసులు

4వ తేదీ మద్యం సేవించి వాహనాలు నడిపిన 65 మంది వ్యక్తులుకు జరిమానాతో పాటు జైలు శిక్ష విధించారు. 4వ తేదీన 3 ట్రాఫిక్, 5 ట్రాఫిక్ పోలీసులు చేసిన తనిఖీల్లో 65 కేసులలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబట్టారు.

వారిని ఏడవ అడిషనల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్ట్ లో మరియు ఎనిమిదవ అడిషనల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్ట్ ల్లో హాజరు పరిచారు. న్యాయాధికారులు కె.సురేష్ బాబు, విజయ్ కుమార్ రెడ్డిలు నిందితులకు శిక్షలు ఖరారు చేశారు.

65మందిలో ఒక వ్యక్తికి 05 రోజులు జైలు మరియు రూ.10,000/- జరిమానా విధించారు.ఇద్దరు వ్యక్తులకు ఒక్కొక్కరికి 04 రోజులు జైలు మరియు రూ.10,000/- జరిమానా విధించారు. ఆరుగురికి ఒక్కొక్కరికి 03 రోజులు జైలు మరియు రూ.10,000/- జరిమానా విధించారు. మరో ఆరుగురికి ఒక్కొక్కరికి 02 రోజులు జైలు మరియు రూ.10,000/- జరిమానా విధించారు. 24 మందికి ఒక్కొక్కరికి 01 రోజు జైలు మరియు రూ.10,000/- చొప్పున జరిమానా విధించారు. మిగిలిన 26 మందికిఒక్కొక్కరికి రూ.10,000/- జరిమానా విధించారు.

5వ తేదీన 50మందిపై కేసులు…

మార్చి 5న 50మందిపై కేసులు నమోదు చేశారు. వారిలో ఒకరికి 10 రోజులు జైలు మరియు రూ.10,000/- జరిమానా విధించారు. మరొకరికి 08 రోజులు జైలు మరియు రూ.10,000/- జరిమానా విధించారు. ఒక వ్యక్తికి 07 రోజులు జైలు మరియు రూ.10,000/- జరిమానా విధించారు. ఇద్దరికి 06 రోజులు జైలు మరియు రూ.10,000/- జరిమానా విధించారు. నలుగురికి ఒక్కొక్కరికి 05 రోజులు జైలు మరియు రూ.10,000/- జరిమానా విధించారు.

ఇద్దరు వ్యక్తులకు ఒక్కొక్కరికి 04 రోజులు జైలు, రూ.10,000/- జరిమానా విధించారు. మరో నలుగురికి 03 రోజులు జైలు మరియు రూ.10,000/- జరిమానా, ఏడుగురికి 02 రోజులు జైలు మరియు రూ.10,000/- జరిమానా విధించారు. 13 మంది వ్యక్తులకు 01 రోజు జైలు మరియు రూ.10,000/- చొప్పున జరిమానా విధించారు. 15 మందికి వ్యక్తులకు ఒక్కొక్కరికి రూ.10,000/- జరిమానా విధించారు.

6వ తేదీన 69 మందికి శిక్షలు….

6వ తేదీన మద్యం సేవించి వాహనాలు నడిపిన 69 మంది వ్యక్తులుకు జైలు మరియు జరిమానా విధించారు. వీరిలో ఒకరికి 05 రోజులు జైలు మరియు రూ.10,000/- జరిమానా విధించారు. ఇద్దరికి ఒక్కొక్కరికి 04 రోజులు జైలు మరియు రూ.10,000/- జరిమానా విధించారు. ఐదుగురు వ్యక్తులకు ఒక్కొక్కరికి 03 రోజులు జైలు మరియు రూ.10,000/- జరిమానా విధించారు. ముగ్గురు వ్యక్తులకు ఒక్కొక్కరికి 02 రోజులు జైలు మరియు రూ.10,000/- జరిమానా విధించారు. 18 మంది వ్యక్తులకు ఒక్కొక్కరికి 01 రోజు జైలు మరియు రూ.10,000/- చొప్పున జరిమానా విధించారు. ఆరుగురికి ఒకొక్కరికి రూ.15,000/- చొప్పున జరిమానా, మిగిలిన 34మంది వ్యక్తులకు ఒక్కొక్కరికి రూ.10,000/- జరిమానా విధించారు. .

7న 49మందిపై కేసులు…

7వ మద్యం సేవించి వాహనాలు నడిపిన 49 మంది వ్యక్తులుకు జైలు మరియు జరిమానా విధించారు. 1వ ట్రాఫిక్ పోలీసు వారు మొత్తం 49 కేసులలో మద్యం సేవించి వాహనములు నడిపే చోదకులకు శిక్షలు విధించారు. ఒకరికి 13 రోజులు జైలు మరియు రూ.10,000/- జరిమానా విధించారు.

ఇద్దరికి 12 రోజులు జైలు మరియు రూ.10,000/- జరిమానా విధించారు. ఒకరికి 11 రోజులు జైలు మరియు రూ.10,000/- జరిమానా విధించారు. ఒకరికి 10 రోజులు జైలు మరియు రూ.10,000/- జరిమానా విధించారు. ఒకరికి 09 రోజులు జైలు మరియు రూ.10,000/- జరిమానా విధించారు. ఒకరికి 07 రోజులు జైలు మరియు రూ.10,000/- జరిమానా విధించారు.

మరొకరికి 06 రోజులు జైలు మరియు రూ.10,000/- జరిమానా విధించారు. ఐదుగురికి 05 రోజులు జైలు మరియు రూ.10,000/- జరిమానా విధించారు. ముగ్గురికి ఒక్కొక్కరికి 04 రోజులు జైలు మరియు రూ.10,000/- జరిమానా విధించారు. 11 మందికి 3రోజుల జైలు, జరిమానా, 12 మందికి రెండు రోజుల జైలు జరిమానా, ఆరుగురికి ఒక రోజు జైలు జరిమానా విధించారు.

బ్రీత్ అనలైజర్ చట్టబద్దత ఎంత..?

విజయవాడలో మద్యం కేసులో పట్టుబడిన రిమాండ్ ఖైదీ మృతి చెందిన నేపథ్యంలో బ్రీత్ అనలైజర్‌ పరీక్షల చట్టబద్దతపై న్యాయనిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బ్రీత్ అనలైజర్‌ పరీక్షల్లో మద్యం సేవించినట్టు తేలగానే వారిని కోర్టులో హాజరు పరుస్తున్నారని, పట్టుబడే వారంతా నిరక్షరాస్యులు, రోజు కూలీలు, చట్టాలపై అవగాహన లేని వారేనని హైకోర్టు న్యాయవాది విష్ణుభట్ల జయప్రకాష్‌ అభిప్రాయపడ్డారు.

మద్యం కేసుల్లో పట్టుబడిన వారు పరువు పోతుందనో, మరో కారణంతోనో న్యాయస్థానాల్లో నేరాన్ని అంగీకరిస్తున్నారని, తమకు వైద్య పరీక్షలు జరపలేదనే విషయాన్ని కోర్టుల దృష్టికి తీసుకురావడం లేదని చెప్పారు. ఫలితంగా జైలుకు వెళ్లాల్సి రావడంతో పాటు భారీ జరిమానాలు చెల్లించాల్సి వస్తోంది. బ్రీత్ అనలైజర్‌ పరీక్షల ప్రామాణికత, చట్టబద్దత ఏ మేరకు న్యాయస్థానంలో నిలుస్తుందో ప్రజలకు అవగాహన ఉండదన్నారు.

మద్యం సేవించిన కేసుల్లో నిందితులకు వైద్య పరీక్షల ద్వారా ధృవీకరించాల్సి ఉంటుంది. పోలీసులు కేవలం బ్రీత్ అనలైజర్ పరీక్షల్లో వచ్చే ఫలితాల ఆధారంగా కోర్టుల్లో హాజరు పరుస్తున్నారని చెబుతున్నారు. నిందితులు తాము నేరం చేశామని అంగీకరిస్తుండటంతో శిక్ష ఖరారు అవుతున్నాయని చెబుతున్నారు. చట్టంలో ఉన్న సాంకేతిక అంశాలపై సామాన్యులకు అవగాహన లేకపోవడమే ఈ సమస్యకు కారణమన్నారు.

మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన కేసుల్లో ఒక్కొక్కరు రూ.10వేల రుపాయల జరిమానా ప్రభుత్వానికి చెల్లిస్తున్నారని కొత్త చట్టాలపై ఏ మాత్రం అవగాహన కల్పించడం లేదని గుర్తు చేశారు. మోటారు వాహన చట్టంలో నిర్వచనాలు, వాటికి పడే శిక్షలు, జరిమానాలపై అవగాహన లేమి వల్లే ఈ సమస్య తలెత్తుతోందన్నారు.

 

WhatsApp channel

టాపిక్

Ap PoliceAndhra Pradesh NewsTelugu NewsLatest Telugu NewsBreaking Telugu NewsTrending Ap
Source / Credits

Best Web Hosting Provider In India 2024