Friday OTT Releases: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 12 సినిమాలు.. 6 వెరీ ఇంట్రెస్టింగ్.. ఎక్కడెక్కడ చూస్తారంటే?

Best Web Hosting Provider In India 2024

OTT Releases On This Friday: ఈ వారం థియేటర్లలో విశ్వక్ సేన్ గామి, గోపీచంద్ భీమా సినిమాలు సందడి చేస్తున్నాయి. ఈవారం థియేటర్లలో ఇంట్రెస్టింగ్‌గా ఉన్న సినిమాల్లో ఇవి మాత్రమే. ఇక ఓటీటీలో ఎప్పటిలాగే ఈ వారం సినిమాలు సందడి చేసేందుకు వచ్చాయి. వాటిలో కొన్ని నేటి నుంచి అంటే మహా శివరాత్రి పర్వదినం అయిన మార్చి 8 నుంచి స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ శుక్రవారం ఓటీటీలో సందడి చేస్తున్న సినిమాలు, వెబ్ సిరీసులు ఏంటో చూద్దాం.

ట్రెండింగ్ వార్తలు

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ

షో టైమ్ (తెలుగు డబ్బింగ్ హిందీ వెబ్ సిరీస్)- మార్చి 8

ట్రూ లవర్ (తమిళ సినిమా)- మార్చి 8

12th ఫెయిల్ (తెలుగు స్ట్రీమింగ్)- మార్చి 8

నెట్ ప్లిక్స్ ఓటీటీ

మేరీ క్రిస్మస్ (హిందీ చిత్రం)- మార్చి 8

డామ్ సెల్ (హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్)- మార్చి 8

అన్వేషిప్పిన్ కండేతుమ్ (మలయాళ డబ్బింగ్ సినిమా)- మార్చి 8

బ్లోన్ అవే సీజన్ 4 (వెబ్ సిరీస్)- మార్చి 8

లాల్ సలామ్ (తమిళ మూవీ)- మార్చి 8 (రూమర్ డేట్)

ది క్వీన్ ఆఫ్ టియర్స్ (కొరియన్ వెబ్ సిరీస్)- మార్చి 9

అమెజాన్ ప్రైమ్ వీడియో

ఊరు పేరు భైరవకోన (తెలుగు సినిమా)- మార్చి 8

కెప్టెన్ మిల్లర్ (హిందీ వెర్షన్)- మార్చి 8

ఆహా

బ్రీత్ (తెలుగు మూవీ)- మార్చి 8

ఇలా మార్చి 8న ఒక్కరోజే 12 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో నెట్‌ఫ్లిక్స్‌లోని మేరీ క్రిస్మస్, అన్వేషిప్పిన్ కండేతుమ్, లాల్ సలామ్, అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోని ఊరు పేరు భైరవకోన సినిమాలు స్పెషల్ కానున్నాయి. వాటితోపాటు ఇదివరకే స్ట్రీమింగ్ అవుతూ తాజాగా తెలుగులోకి వచ్చి 12th ఫెయిల్ మూవీ మరింత ఇంట్రెస్ట్ సినిమా కానుంది. అలాగే నందమూరి చైతన్య కృష్ణ నటించిన భారీ డిజాస్టర్ మూవీ బ్రీత్ కూడా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఇలా మొత్తంగా 6 సినిమాలు ఇంట్రెస్టింగ్‌వి ఉన్నాయి.

ఇకపోతే హనుమాన్ మూవీ ఇదివరకే మార్చి 8న స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. కానీ, మార్చి 8కి ఒక రోజు ముందు మార్చి 7న హనుమాన్ ఓటీటీ సంస్థ జీ5 (ZEE5) పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. సాధారణంగా ఒకరోజు ఓటీటీ రిలీజ్ ముందు ఆయా సంస్థలు సినిమాలకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్‌ను (Hanuman Digital Streaming) అధికారికంగా ప్రకటిస్తాయి. కానీ, హనుమాన్ విషయంలో మాత్రం ఊహించని విధంగా అఫిషీయల్ అనౌన్స్ మెంట్ ఇవ్వలేదు.

దాంతో జీ5 సంస్థకు నెటిజన్స్, మూవీ లవర్స్ హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్‌పై ప్రశ్నలతో ట్వీట్స్ చేస్తున్నారు. హనుమాన్ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేస్తారా అంటూ ట్విటర్ వేదికగా ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఇవాళ మహా శివరాత్రి కదా హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయండి అని జీ5 ఓటీటీని అభ్యర్థించాడు ఓ నెటిజన్. కానీ, హనుమాన్ డిజిటల్ స్ట్రీమింగ్‌పై తమకు ఎలాంటి అప్డేట్ లేదని జీ5 సంస్థ గురువారం నుంచి అదే మాట చెప్పుకొస్తుంది. దీంతో సినీ ప్రేక్షకులు కాస్తా నిరాశ పడినట్లు అయింది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024