YSRCP Nandigama :
ఎన్టీఆర్ జిల్లా / చందర్లపాడు :
ది.13-12-2022(మంగళవారం) ..
జగనన్న కాలనీలో లబ్ధిదారుని నూతన గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
పేదవాడి సొంత ఇంటి కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ..
చందర్లపాడు గ్రామంలోని జగనన్న కాలనీలో నూతనంగా ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారుని గృహప్రవేశ వేడుకలో పాల్గొని వారి కుటుంబ సభ్యులకు శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు శుభాకాంక్షలు తెలిపారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది నిరుపేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలను అందజేసిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కిందన్నారు ,కుల- మత -రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఆయా గ్రామాల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ఉచితంగా ఇళ్ల స్థలాల పట్టాలను అందజేయడమే కాకుండా ఆయా స్థలాలలో వారు సొంత ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం తరఫున రూ. 1,80,000 ఆర్థిక సహాయం కూడా అందజేస్తున్నట్లు తెలిపారు , నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లోని జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణం వేదవంతంగా జరుగుతుందని , జగనన్న కాలనీలో కొత్త ఊర్లను తలపిస్తున్నాయన్నారు ,గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఏ ఒక్కరికి కూడా సెంటు స్థలం ఇచ్చిన దాఖలాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు , తెలుగుదేశ ప్రభుత్వంలో పేదలను గాలికి వదిలేసి దోపిడీయే లక్ష్యంగా పనిచేశారని దుయ్యబట్టారు ..
ఈ సందర్భంగా జగనన్న కాలనీలో నూతన గృహం నిర్మించుకున్న లబ్ధిదారుడు షేక్ నాగులు మాట్లాడుతూ సొంత ఇల్లు లేక ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడ్డామని , జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మాలాంటి పేదవాళ్ల కష్టాలను గుర్తించి- ఉచితంగా మా ఊర్లోనే ఇళ్ల స్థలాలను అందజేయడం కాకుండా , ఇల్లు నిర్మించుకోవడానికి సహకారం అందించిన జగనన్న ప్రభుత్వాన్ని , స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ జగన్ మోహన్ రావు గారి సహకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేమన్నారు , మా కుటుంబం తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు ..
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కస్తాల పున్నమ్మ , జడ్పిటిసి ముక్కపాటి నరసింహారావు , మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వెలగపూడి వెంకటేశ్వరరావు , యార్లగడ్డ సత్యనారాయణ ప్రసాద్ , మండల కన్వీనర్ కందుల నాగేశ్వరరావు ,ఎంపీటీసీ మౌలాలి, లాల్ సా, తదితరులు పాల్గొన్నారు ..