Best Web Hosting Provider In India 2024
MealMaker Curry: సోయా ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మీల్ మేకర్ కర్రీని సోయా చంక్స్తో టేస్టీగా వండవచ్చు. మీల్ మేకర్ మసాలా కర్రీని ఒకసారి వండారంటే చికెన్ కర్రీ, మటన్ కర్రీలు కూడా దిగదుడుపే. మాంసాహారం తినని రోజుల్లో ఇలా మీల్ మేకర్ మసాలా కర్రీ వండుకుని చూడండి, నాన్ వెజ్ తినలేదన్న లోటు ఉండదు. అంత రుచిగా ఉంటుంది ఈ కర్రీ. మీల్ మేకర్ మసాలా కర్రీ రెసిపీలు ఎలా చేయాలో చూద్దాం.
ట్రెండింగ్ వార్తలు
మీల్ మేకర్ మసాలా కర్రీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
మీల్ మేకర్ – వంద గ్రాములు
అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక స్పూను
దాల్చిన చెక్క ముక్క – ఒకటి
ధనియాలు – ఒక స్పూను
వేరుశెనగ పలుకులు – ఒక స్పూను
లవంగాలు – అయిదు
పచ్చి కొబ్బరి – చిన్న ముక్క
నూనె – మూడు స్పూన్లు
యాలకులు – రెండు
ఉల్లిపాయ – ఒకటి
కరివేపాకులు – గుప్పెడు
ఉప్పు – రుచికి సరిపడా
టమాటా – ఒకటి
పుదీనా తరుగు – ఒక స్పూను
కారం – అర స్పూను
పసుపు – చిటికెడు
పచ్చి మిర్చి – రెండు
ఉల్లిపాయ – ఒకటి
కొత్తిమీర తరుగు – ఒక స్పూను
మీల్ మేకర్ మసాలా కర్రీ రెసిపీ
1. వేడినీటిలో మీల్ మేకర్లను వేసి పది నిమిషాలు నానబెట్టి తరువాత గట్టిగా పిండేయాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు మిక్సీజార్లో ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, పచ్చికొబ్బరి, యాలకులు, అల్లం వెల్లుల్లి పేస్టు, కాస్త నీళ్లు వేసి మెత్తటి పేస్టులా చేయాలి.
3. ఆ పేస్టులను తీసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. ఆ నూనెలో మీల్ మేకర్ లను వేసి వేయించుకోవాలి. తరువాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
5. అదే కళాయిలో ఉల్లిపాయల తరుగును వేసి వేయించాలి.
6. ఉల్లిపాయలు బాగా వేగాక అందులో మిక్సీలో చేసి పెట్టుకున్న మసాలా పేస్టును వేసి బాగా కలుపుకోవాలి.
7. ఇప్పుడు పచ్చిమిర్చి తరుగు, టమోటా తరుగు వేసి బాగా కలుపుకోవాలి.
8. పైన మూత పెట్టి మగ్గనివ్వాలి. మెత్తగా ఇగురులా అవుతుంది.
9. అందులో ఉప్పు, కారం, పసుపు, కరివేపాకులు, పుదీనా తరుగు వేసి బాగా కలుపుకోవాలి.
10. మరో అయిదు నిమిషాలు మగ్గనివ్వాలి. అందులో ముందుగా వేయించి పెట్టుకున్న మీల్ మేకర్ వేసి కలుపుకోవాలి.
11. ఇగురు కోసం అరగ్లాసు నీళ్లు పోసుకోవాలి. పైన మూత పెట్టి ఉడికించుకోవాి.
12. పది నిమిషాలు ఉడికించి పైన కొత్తిమీర చల్లుకోవాలి. అంతే మీల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది.
వేడి వేడి అన్నంలో ఈ మీల్ మేకర్ మసాలా కర్రీ వేసుకుని తింటే రుచి అదిరిపోతుంది. ఈ కర్రి చపాతీ, రోటితో కూడా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీని తింటే చికెన్, మటన్ కర్రీలు గుర్తుకువస్తాయి. ప్లెయిన్ బిర్యాని చేసుకుని, దానికి జతగా ఈ కర్రీ తింటే రుచి మామూలుగా ఉండదు. ఒక్కసారి మీల్ మేకర్ మసాలా కర్రీ తిన్నారంటే వారానికోసారి మీరే వండుకుని తింటారు.
సోయాతో చేసే మీల్ మేకర్ తరచూ తింటే హార్మోన్ల అసమతుల్యత సమస్య రాకుండా ఉంటుంది. మహిళలు తరచూ సోయా మీల్ మేకర్ తింటే మెనోపాజ్ సమస్యలు, పీసీఓఎస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మీల్ మేకర్ తినడం వల్ల మధుమేహం, గుండె సంబంధ వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. పొట్టలోని మంచి బ్యాక్టిరియాకు మీల్ మేకర్ ఎంతో సహాయపడుతుంది.