YSRCP Nandigama :
ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.13-12-2022(మంగళవారం) ..
జగన్ పాలనకు అడుగడుగునా బ్రహ్మరథం ..
పట్టణంలోని 2 వ వార్డు లో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం”లో భాగంగా సంక్షేమ పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ పట్టణంలోని 2 వ వార్డులో గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంగళవారం సాయంత్రం ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ – ప్రజల సమస్యలను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు అడిగి తెలుసుకున్నారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడేళ్ల రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి -సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ,అందుకే గడపగడపలో ప్రజల నుంచి విశేష ఆదరణ వస్తుందని తెలిపారు , సాంకేతిక సమస్యలతో అర్హులు ఎవరికైనా పథకాలు అందకపోతే వెంటనే సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు , రైతు భరోసా, అమ్మఒడి ,వైఎస్ఆర్ చేయూత, ఆసరా ,విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన , తదితర పథకాల అమలు చేస్తూ ఏ ముఖ్యమంత్రి కి సాధ్యం కాని విధంగా జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలన అందిస్తున్నారని కొనియాడారు ,రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా పథకాలు ఇస్తున్నారన్నారు ,ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలే కాకుండా మరెన్నో సంక్షేమ పథకాలతో ప్రజలకు లబ్ధి చేకురుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమే అన్నారు , టిడిపి హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో దోపిడీ చేసేవారని విమర్శించారు ,
ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ డాక్టర్ జయరాం ,ఏఈ ఫణీ శ్రీనివాస్, కౌన్సిలర్లు తానూరి రాము, పాకాల పాటి కిరణ్ , షేక్ యాకోబు వలి , కో ఆప్షన్ జాఫర్ ,నాయకులు బండారు వెంకట్రావు ,మున్నాభాయ్ , కమాల్ ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ,తదితరులు పాల్గొన్నారు ..