YSRCP Nandigama : నందిగామలో ఘనంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ..

YSRCP Nandigama :

 

 

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.21-12-2022(బుధవారం) ..

నందిగామలో ఘనంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ..

పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి వైయస్ జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ,ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..

మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు , ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..

సర్వమత ప్రార్థనలు నిర్వహించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి ఆశీస్సులు అందజేసిన మత పెద్దలు ..

నందిగామ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు , ముందుగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు, శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ లు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ..

అనంతరం పార్టీ నాయకులు ,కార్యకర్తలు కలిసి ప్రత్యేకంగా తయారు చేయించిన కేకును ఎమ్మెల్యే -ఎమ్మెల్సీలు డాక్టర్ జగన్ మోహన్ రావు ,డాక్టర్ అరుణ్ కుమార్ లు వైయస్ జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తిని , అధికారంలోకి వచ్చిన నాటి నుంచి యావత్ దేశం రాష్ట్రం వైపు చూసేలా పాలన సాగిస్తున్నారని తెలిపారు , కుల-మత -వర్గ- రాజకీయ భేదాలు చూడకుండా ప్రతి ఒక్కరికి సమన్యాయం చేయాలని సంకల్పంతో పనిచేస్తూ ,పేదల జీవన ప్రమాణాలు పెంచేలా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు , దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వ పదవులు ,మహిళా రిజర్వేషన్ అమలు చేస్తూ మహిళా సాధికారత సాధించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మహిళా పక్షపాతిగా నిలిచారన్నారు ,ప్రపంచ దేశాలు ఏ విధంగా అయితే సుస్థిరమైన అభివృద్ధి ప్రమాణాలను పాటిస్తుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సుస్థిర అభివృద్ధిని వైయస్ జగన్ కొనసాగిస్తున్నారన్నారు ,విద్య- వైద్యం విషయంలో వైయస్ జగన్ ప్రభుత్వం పని చేస్తున్న తీరు దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు ,ఇటువంటి ముఖ్యమంత్రి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో మరింత కాలం ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు ..

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు ,అభిమానులు పాల్గొన్నారు ‌..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *