YSRCP Nandigama : కమ్మవారిపాలెం గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం” ..

YSRCP Nandigama :

 

 

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ మండలం :
ది.26-12-2022(సోమవారం) ..

జవాబుదారీ పాలన చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ..

కమ్మవారిపాలెం గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం”లో భాగంగా సంక్షేమ పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

నందిగామ మండలంలోని కమ్మవారిపాలెం గ్రామంలో గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ – ప్రజల సమస్యలను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు అడిగి తెలుసుకున్నారు ..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై నమ్మకంతో ఓట్లు వేసి ముఖ్యమంత్రిగా గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రభుత్వాన్ని నేరుగా ప్రజల ఇళ్ల ముంగిటకే తీసుకువెళ్లి సంక్షేమ పథకాలను అందజేస్తున్నట్లు తెలిపారు , దేశ చరిత్రలోనే ఎక్కడా లేనివిధంగా 175 సీట్లకు గాను 151 సీట్లతో ఒక పార్టీకి అధికారాన్ని అప్పజెప్పిన ప్రజల అభిమానానికి జవాబుదారితనంగా ఈ మూడేళ్లలో చేసిన పరిపాలనను వివరిస్తూ ,వారి ఇళ్ల ముంగిటకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించే విధంగా కార్యచరణ రూపొందించి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు ,గతంలో ఏ పాలకులు కూడా ఎన్నికలప్పుడు తప్పితే ప్రజల వద్దకు వెళ్లిన దాఖలాలు లేవని ,గతానికి భిన్నంగా నేడు వైయస్ జగన్ ప్రభుత్వాన్నే నేరుగా ప్రజల వద్దకు తీసుకువెళ్తున్నారన్నారు ,ప్రజల పట్ల అంకితభావంతో -చిత్తశుద్ధితో పనిచేసి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాజనీతిజ్ఞుడుగా పేరు తెచ్చుకున్నారన్నారు ..

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెంటమాల నిర్మల- రాజేంద్ర, మాజీ సర్పంచ్ వేల్పుల కిషోర్, ఎంపీటీసీ పెసరమల్లి రమాదేవి-స్టాలిన్, మండల కన్వీనర్ శివ నాగేశ్వరరావు, నాయకులు చండ్ర కోటేశ్వరరావు, జంపాని సుబ్బారావు , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ,తదితరులు పాల్గొన్నారు ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *