Best Web Hosting Provider In India 2024
Krishna mukunda murari serial april 2nd episode: కృష్ణ భవానీని క్షమించమని అడుగుతుంది. మీరు ఇచ్చిన బాధ్యత నెరవేర్చలేకపోయానని కృష్ణ అంటుంది. ఇందులో నీ తప్పేముంది మనిషిని అయితే మార్చగలం కానీ బండరాయిని మార్చలేం కదా. ముకుంద ఒక బండ రాయి. మురారి దక్కడని తెలిసిన కూడా తనకోసమే ఎదురుచూసింది. తనని నువ్వు గుడ్డిగా నమ్మేశావు. ఇకనైనా నీ గురించి నువ్వు ఆలోచించుకో ఇతరుల గురించి ఆలోచించొద్దని భవాని చెప్తుంది. అప్పుడే భవాని అనే పిలుపు వినిపిస్తుంది.
సీరియల్ లోకి కొత్త క్యారెక్టర్ లు ఎంట్రీ ఇస్తారు. భవానీ ఆడబిడ్డ, తన కూతురు ఇంటికి వస్తారు. రావడంతోనే తన నోటి దురుసు చూపించేస్తుంది. ముకుంద చనిపోయింది అంట కదా అది తెలిసే వచ్చామని అంటుంది. అసలు నా కూతుర్నే కోడలుగా చేసుకున్నట్టయితే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదుగా. అప్పుడు అడిగితే వద్దని అన్నావ్ ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు నీ కొడుక్కి నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయమని రజినీ అడుగుతుంది.
భవానీని అవమానించిన రజినీ
ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసని భవానీ చెప్తుంది. ఏం తెలుసు భవానీ నీకు అందుకే ఇంటి పరిస్థితి ఇలా అయ్యింది. ఆదర్శ్ తాగుబోతు అయ్యాడని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. మాటకు ముందు ఒకసారి, వెనుక ఒకసారి భవాని భవాని అని పిలుస్తుంది. దీంతో పెద్దత్తయ్యని ఇంకోసారి పేరు పెట్టి పిలవ్వద్దని కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడమని కృష్ణ సీరియస్ అవుతుంది. అసలు నువ్వు ఎవతివే నాకు చెప్పడానికి మా వదినని ఎలా పిలవాలో నాకు తెలుసని రజినీ కృష్ణ నోరు మూయించేందుకు చూస్తుంది.
భవానీ కూడా కృష్ణని అపుతుంది. మిమ్మల్ని అలా ఏకవచనంతో పిలవడం నాకు నచ్చలేదు. మా పెద్దత్తయ్యని పేరు పెట్టి పిలిచే ధైర్యం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ లేదు అంటూ కృష్ణ భవానిని ఆకాశానికి ఎత్తేస్తుంది. రేవతి ఎందుకు ఇప్పుడు ఇవన్నీ అంటే కోడలిని అదుపులో పెట్టుకోలేకపోయావని రజినీ అంటుంది. ఇక కృష్ణ కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది.
రజిని తన కూతురు సంగీతని ఆదర్శ్ కి దగ్గర చేయాలని తెగ ప్రయత్నిస్తుంది. బావ తాగి ఉన్నాడు తిన్నాడో లేదో వెళ్లి కనుక్కుని బావకి వంట చేసి పెట్టమని చెప్తుంది. రావడంతోనే కృష్ణతో గొడవ పెట్టుకున్నారు మనకు పనికొచ్చేలాగే ఉన్నారు. వీళ్ళని అడ్డం పెట్టుకుని చక్రం తిప్పుదాము కుదరకపోతే ఇంట్లో నుంచి బయటకి పంపించేయాలని ముకుంద మనసులో అనుకుంటుంది.
సంగీతని తిట్టిన ఆదర్శ్
ఆదర్శ్ గదిలో ముకుంద గురించే ఆలోచిస్తూ ఉంటాడు. నా మీద ఉన్న అభిమానాన్ని నువ్వు ప్రేమగా మార్చుకున్నట్లయితే మనం సంతోషంగా కలిసి ఉండే వాళ్ళం. నిన్ను మర్చిపోలేక పోతున్నాను ఎందుకు ఇలా చేశావు ముకుంద అని బాధపడుతూ ఉండగా సంగీత వస్తుంది. బావా బావా అంటూ ప్రేమ వలకబోసేందుకు చూస్తుంది.
ముకుంద కోసం అంతగా బాధపడతావ్ ఏంటి? నువ్వు ఏమైనా తనతో కలిసి ఉన్నావా? పెళ్లి చేసుకోగానే నువ్వు వదిలేసి పోయావు. నువ్వు వచ్చాక తను వదిలేసి పోయింది కాకపోతే ఒకటే తేడా నువ్వు తిరిగి వచ్చావు ముకుంద తిరిగి రాలేదు అని నోటికి వచ్చినట్టు వాగడంతో ఆదర్శ్ సీరియస్ అవుతాడు. ఎక్కువ మాట్లాడితే ఇంట్లో నుంచి కూడా పంపించేస్తానని తిట్టి తనని బయటికి పంపించేస్తాడు. ఈరోజు కాకపోతే రేపైనా నిన్ను బుట్టలో వేసుకుంటానని వెళ్ళిపోతుంది.
రజినీకి కృష్ణ కౌంటర్
మురారి నిద్రలేచి కృష్ణ ఎక్కడ ఉందని అనుకుంటాడు. అప్పుడే కృష్ణ వచ్చి చిటపటలాడుతుంది. ఏమైంది అంటే ఆవిడకి ఎంత ధైర్యం ఉంటే పెద్దత్తయ్యను పేరు పెట్టి పిలుస్తుంది, అలా పిలవడం నాకు అసలు నచ్చలేదు ఇంకోసారి అత్తయ్యను ఎవరైనా అవమానిస్తే సహించేదే లేదని చెప్పి చిర్రుబుర్రులాడుతుంది. పక్కన వాళ్ళ గురించి ఆలోచించద్దని పెద్దమ్మ చెప్పింది కదా నీకు నీ సంగతి నువ్వు చూసుకో అంటాడు. కానీ కృష్ణ మాత్రం పెద్దత్తయ్యను ఎవరేమైనా అంటే ఊరుకునేది లేదని చెప్తుంది. రజిని అత్తయ్య కంచు ఆ కంచుని వంచే రకం కృష్ణ ఇంట్లో ఏం జరగబోతుందోనని మురారి అనుకుంటాడు.
కృష్ణ కిందకి వస్తుంటే సంగీత తన అమ్మని కాఫీ కావాలి అని అడుగుతుంది. రజిని కావాలని మనం పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అదిగో వస్తుందిగా పనిమనిషి తనే పెట్టిస్తుందిలేనని కృష్ణని అవమానించేలా మాట్లాడుతుంది. ఇంటికి వచ్చిన వాళ్ళని పట్టించుకునేది లేదని తిడుతుంది. కృష్ణ వాళ్ళవైపు కోపంగా చూస్తూనే నవ్వుతూ కౌంటర్ వేస్తుంది. మీరే కదా అన్నారో రాత్రి మేము ఇంట్లో వాళ్ళం, పరాయి వాళ్ళం కాదు అని మాట్లాడారు. ఇంట్లో వాళ్ళకి మర్యాదలు చేయరు. చుట్టాలకైతే మర్యాదలు చేస్తారు అంటే మేం చుట్టాలమే కదా అని రజిని నోరు జారుతుంది. మీకు ఆ క్లారిటీ ఉంది కదా అనేసి కృష్ణ నవ్వుతూ వెళ్లి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. చుట్టాలుగా వెళ్లిపోవడానికి రాలేదు ఈ ఇంట్లో భవానీ స్థానంలో చక్రం తిప్పడానికి వచ్చానని రజినీ అంటుంది.