Best Web Hosting Provider In India 2024
వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
నెల్లూరు: కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడం చంద్రబాబు రక్తంలోనే ఉందని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మండిపడ్డారు . ఇలాంటి వారిని సైకాలజీలో పేథలాజికల్ లయ్యర్స్ అంటారు. మార్కాపురం వెళ్లి వెలిగొండ ప్రాజెక్టు పనులు తానే సగానికి పైగా పూర్తి చేశానని గడియారం స్తంభం సాక్షిగా నాలుక మడతేశారని విమర్శించారు. చంద్రబాబు తీరుపై ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా ఎండగట్టారు.
•వెలిగొండ పూల సుబ్బయ్య ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి 18.7 కి.మీ పొడవైన మొదటి టన్నెల్లో 14 కిలోమీటర్లు పూర్తి చేసింది దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారని అందరికీ తెలుసు. 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం చచ్చీచెడీ రెండు కిమీల టన్నెల్ మాత్రమే తవ్వింది. వెలిగొండలో రెండు టన్నెల్ పనులను విజయవంతంగా పూర్తి చేసి జాతికి అంకితం చేసింది సిఎం వైయస్ జగన్ గారు.
•ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మంది జనాభాకు మంచి నీరు సరఫరా అవుతుంది. ఫ్లోరైడు పీడ విరడగ అవుతుంది.
•అమరావతి నుంచి ప్రతి జిల్లాకు బుల్లెట్ ట్రెయిన్ నడిపిస్తానని వేసేశాడు అప్పట్లో.
•ఇలాంటి పిట్టల దొర కబుర్లు ఇంకా చెబుతూనే ఉన్నారు. 40 ఏళ్లుగా మైండ్సెట్ మారనందున సమాజంలో వస్తున్న మార్పులు ఆయనకు అర్థం కావడం లేదు అంటూ విజయసాయిరెడ్డి ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.