OTT Top Telugu Movies in April: ఏప్రిల్‍లో ఓటీటీలోకి వచ్చే టాప్-5 తెలుగు సినిమాలు ఇవే

Best Web Hosting Provider In India 2024

Top Telugu OTT Release in April: ఓటీటీల్లో కొత్త కంటెంట్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తూనే ఉంటారు. ఇంట్లో ఎంటర్‌టైన్‍మెంట్ కోసం ఓటీటీలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇందుకు అనుగుణంలో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఈనెల (ఏప్రిల్)లోనూ చాలా చిత్రాలు ఓటీటీల్లో స్ట్రీమింగ్‍కు రానున్నాయి. కొన్ని తెలుగు సినిమాలు కూడా స్ట్రీమింగ్‍కు రానున్నాయి. వాటిలో ఈనెలలో ఓటీటీలోకి రానున్న 5 టాప్ తెలుగు చిత్రాలు ఏవో ఇక్కడ చూడండి.

గామి

మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ ప్రధాన పాత్ర పోషించిన గామి సినిమా సూపర్ హిట్ అయింది. విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించిన అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ కమర్షియల్‍గా సక్సెస్ అవడంతో పాటు ప్రశంసలను దక్కించుకుంది. మార్చి 8వ తేదీన థియేటర్లలో రిలీజై విజయం సాధించింది. ఈ గామి చిత్రం ఏప్రిల్ నెలలోనే ‘జీ5’ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ చిత్రం ఏప్రిల్ 12వ తేదీన స్ట్రీమింగ్‍కు అడుగుపెడుతుందని అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ విషయంపై జీ5 ఓటీటీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

లంబసింగి

బిగ్‍బాస్ ఫేమ్, నటి దివి వైద్త్య, భరత్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించిన లంబసింగి చిత్రం నేడు (ఏప్రిల్ 2) ‘డిస్నీ+ హాట్‍స్టార్’ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. మార్చి 15వ తేదీన ఈ లవ్ మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, నవీన్ గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో అంచనాలను అందుకోలేకపోయింది. ప్రస్తుతం లంబసింగి సినిమా హాట్‍స్టార్‌లో స్ట్రీమింగ్‍కు వచ్చింది.

భీమా

మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా సినిమా ‘భీమా’ మార్చి 8వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ చిత్రం అనుకున్న స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ఏ హర్ష ఈ మూవీకి దర్శకత్వం వహించారు. భీమా సినిమా కూడా ఏప్రిల్‍లోనే ‘డిస్నీ+ హాట్‍స్టార్’ ఓటీటీలో అడుగుపెట్టనుంది. ఏప్రిల్ 5వ తేదీనే ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వస్తుందని తెలుస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు రానుంది.

చారి 111

ప్రముఖ కమెడియన్ వెన్నెల కిశోర్ హీరోగా నటించిన ‘చారి 111’ సినిమా మంచి అంచనాలతో మార్చి 1వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ స్పై కామెడీ చిత్రానికి టీజీ కీర్తికుమార్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా ఏప్రిల్‍లోనే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. త్వరలో అంటూ ఇప్పటికే ఆ ప్లాట్‍ఫామ్ చెప్పింది. త్వరలోనే చారి 111 స్ట్రీమింగ్ డేట్‍ను ప్రైమ్ వీడియో ఖరారు చేయనుంది.

ఓం భీమ్ బుష్

శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో వచ్చిన హారర్ కామెడీ చిత్రం ‘ఓం భీమ్ బుష్’ మంచి హిట్ సాధించింది. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో మార్చి 22న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం అంచనాలకు మించి వసూళ్లను రాబట్టింది. ప్రేక్షకులను నవ్వించింది. ఓం భీమ్ బుష్ చిత్రం కూడా ఏప్రిల్‍లోనే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఇంకా స్ట్రీమింగ్ డేట్ ఖరారు కాలేదు. అయితే, ఈనెలలోనే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024