Best Web Hosting Provider In India 2024
Premalu OTT Release Date: ఇటీవలి కాలంలో ప్రేక్షకులు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎక్కువగా నిరీక్షిస్తున్న సినిమాల్లో ‘ప్రేమలు’ ఒకటి. ఈ మలయాళ లవ్ రొమాంటిక్ కామెడీ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు అడుగుపెడుతుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. నెస్లన్ కే గపూర్, మమితా బైజూ హీరోహీరోయిన్లుగా నటించిన ప్రేమలు సినిమా భారీ హిట్ అయింది. తక్కువ బడ్జెట్‌తో వచ్చి ఆశ్చర్యపరిచేలా భారీ కలెక్షన్లు దక్కించుకుంది. ఇక, ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.
స్ట్రీమింగ్ డేట్ ఇదే..
ప్రేమలు సినిమా స్ట్రీమింగ్పై డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అధికారిక ప్రకటన చేసింది. ఈ సినిమాను ఏప్రిల్ 12వ తేదీన స్ట్రీమింగ్కు తీసుకురానున్నట్టు వెల్లడించింది. ఈ విషయంపై నేడు (ఏప్రిల్ 2) అధికారిక ప్రకటన చేసింది. “ఈ లవ్ స్టోరీ వైరల్ అయింది. డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఏప్రిల్ 12 నుంచి ప్రేమలు స్ట్రీమింగ్” అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
అయితే, హాట్‌స్టార్ ఓటీటీలో ప్రేమలు చిత్రం మలయాళంలో మాత్రమే స్ట్రీమింగ్కు రానున్నట్టు తెలుస్తోంది. ఇతర భాషల వెర్షన్ల గురించి హాట్‌స్టార్ వెల్లడించలేదు.
తెలుగులో ఎక్కడ?
ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్ కూడా హాట్‌స్టార్ ఓటీటీలోనే ఏప్రిల్ 12న వస్తుందని మొదట్లో సమాచారం వెల్లడైంది. అయితే, ఈ సినిమా తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ హక్కులను ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్ తీసుకుందని కూడా రూమర్లు వస్తున్నాయి. ఏప్రిల్ 12నే ప్రేమలు తెలుగు వెర్షన్ ఆహాలో స్ట్రీమింగ్కు వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ప్రేమలు వసూళ్లు
ప్రేమలు సినిమా ఫిబ్రవరి 9వ తేదీన మలయాళంలో థియేటర్లలో రిలీజ్ అయింది. రూ.5కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఎవరూ ఊహించిన విధంగా భారీస్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా ఇప్పటి వరకు ఏకంగా రూ.135 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది.
ప్రేమలు సినిమా మార్చి 8న తెలుగులోనూ థియేటర్లలో రిలీజ్ అయింది. హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ లవ్ మూవీ తెలుగు వెర్షన్లోనూ భారీ కలెక్షన్లు దక్కించుకుంది. తెలుగులో రూ.15కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు కార్తికేయ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. ప్రమోషన్లను కూడా జోరుగా చేశారు.
కామెడీతో సరదాగా సాగే లవ్ స్టోరీతో ప్రేమలు మూవీ తెరకెక్కింది. ఈ మూవీకి గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించారు. సచిన్ సంతోష్ పాత్రలో నెస్లన్ కే గఫూర్, రేణు రాయ్ క్యారెక్టర్లో మమితా బైజూ ఈ చిత్రంలో మెప్పించారు. ముఖ్యంగా ఈ సినిమాతో మమితా చాలా పాపులర్ అయ్యారు. ఆమె యాక్టింగ్, క్యూట్‌నెస్ ప్రేక్షకులకు తెగనచ్చేశాయి.
ప్రేమలు మూవీలో సంగీత్ ప్రతాప్, శ్యాం మోహన్, అఖిల భార్గవన్, మాథ్యూ థామస్, మీనాక్షి రవీంద్రన్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి విష్ణు విజయ్ సంగీతం అందించారు. ఫాహద్ ఫాజిల్, దిలీశ్ పోతన్, శ్యామ్ పుష్కరన్ నిర్మించిన ఈ మూవీకి అజ్మల్ సాబు సినిమాటోగ్రఫీ చేశారు.