
Best Web Hosting Provider In India 2024

KTR On Phone Tapping Case: 2004 నుంచి జరిగిన ఫోన్ ట్యాపింగ్(Phone Tapping Case) ఆధారాలు అన్ని బయటపెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవాళ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన…. ఫోన్ ట్యాపింగ్ వంటి వ్యవహారాలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) లీకు వీరుడిలాగా మారారని విమర్శించారు. హీరోయిన్లను బెదిరించానని ఓ మంత్రి మాట్లాడారని, అలాంటి దిక్కుమాలిన పనులు చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ట్రెండింగ్ వార్తలు
మా ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ సర్కార్ ఉంది. పదేళ్లు అధికారంలోకి ఉంది. నాడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు… కాంగ్రెస్ పార్టీలోని గడ్డం వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తమ ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో మేము కాదు… కాంగ్రెస్ నేతలే కిరణ్ కుమార్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. 2014 నుంచే కాదు… 2004 నుంచి జరిగిన అన్ని విషయాలన్నీ బయటికి తీయండి. కేవలం ప్రభుత్వమే మారింది. కానీ అధికారులు మాత్రం వారే ఉన్నారు. ఇప్పుడున్న ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి ఆ రోజు మా ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నారు. ఈ రోజు టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఐజీ, ఆ తర్వాత మా ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ డీజీగా హైదరాబాద్ సీపీగా పని చేశారు . ఈ రోజు డీజీపీ రవి గుప్తా ఆ రోజు హోం సెక్రెటరీ.. వీళ్ళందరూ ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఉన్నారు.. ఒక వేళ ఫోన్ ట్యాపింగ్ జరిగితే ఈ అధికారులకు తెలియదా…? అని కేటీఆర్ ప్రశ్నించారు.
టాపిక్