Goa Tour Package : హైదరాబాద్ టు గోవా – బడ్జెట్ ధరలోనే 4 రోజుల స్పెషల్ టూర్ ప్యాకేజీ, ఇవిగో వివరాలు

Best Web Hosting Provider In India 2024

Telangana Tourism Goa Tour Package 2024: ఈ మండే వేసవిలో గోవాకు(Goa Tour Package 2024) వెళ్లే ప్లాన్ ఉందా..? అక్కడ ఉండే బీచ్ ల్లో ఆహ్లాదకరంగా గడపాలని అనుకుంటున్నారా..? అయితే మీలాంటి వారికోసం తెలంగాణ టూరిజం(Telangana Tourism) స్పెషల్ ప్యాకేజీని తీసుకొచ్చింది. అతి తక్కువ ధరోలనే 4 రోజులు అక్కడే గడిపేయవచ్చు. GOA PACKAGE TOUR – ITINERARY అనే పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. రోడ్డు మార్గానే వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఇక్కడ చూడండి…..

ట్రెండింగ్ వార్తలు

Goa Tour Package : గోవా టూర్ ప్యాకేజీ వివరాలు:

  • ఈ టూర్ ప్యాకేజీని తెలంగాణ టూరిజం(Telangana Tourism) ఆపరేట్ చేస్తోంది.
  • హైదరాబాద్ నుంచి బస్సులో రోడ్డు వే ద్వారా వెళ్లాల్సి ఉంటుంది.
  • ప్రతి సోమవారం తేదీల్లో ఈ టూర్ జర్నీ ప్రారంభం అవుతుంది.
  • ఫస్ట్ డే చూస్తే… హైదరాబాద్ లోని బషీర్ బాగ్ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు జర్నీ స్టార్ట్ అవుతుంది. రాత్రి అంతా జర్నీలో ఉంటారు. భోజనం ఇస్తారు.
  • సెకండ్ డే – ఉదయం 6 గంటలకు కలంగుట్ కు చేరుకుంటారు. ఉదయం 10 గంటల నుంచి నార్త్ గోవాలోని పలు ప్రాంతాలను చూస్తారు. ఇందులో మపుసా సిటీ, బోగ్దేశ్వర్ ఆలయం, Fort Aguada, బాగా బీచ్ , Calangute Beach, Vagator Beach ఉంటాయి.
  • థర్డ్ డే – సౌత్ గోవా లోని పలు ప్రాంతాలను చూస్తారు.డోనా పౌలా బీచ్ , Miramar, ఓల్డ్ గోవా చర్చిలు, Mangueshi టెంపుల్, కోల్వా బీచ్, మార్డోల్ బీచ్ తో పాటు మరికొన్నిప్లేస్ లను చూస్తారు.
  • సాయంత్రం క్రూజ్ బోట్‌లో జర్నీఉంటుంది. ఇందుకోసం మీరే డబ్బులను వెచ్చించాలి. ఒక్కరికి రూ. 500గా ఉంటుంది. రాత్రికి Calangute లోని హోటల్ కు చేరుకుంటారు.
  • 4వ రోజు కలంగుట్ నుంచి ఉదయం 11 గంటలకు రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతుంది.
  • 5వ రోజు మార్నింగ్ 6 గంటలకు హైదరాబాద్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

Goa Tour Package Prices: గోవా టూర్ టికెట్ ధరలు వివరాలు..

హైదరాబాద్ – గోవా టికెట్ ధరలు చూస్తే పెద్దలకు రూ. 11999గా నిర్ణయించారు. చిన్నారులకు 9599గా ఉంది. సింగిల్ అక్యుపెన్సీకి రూ. 14900గా ఉంది. వొల్వో కోచ్ ఏసీ కండిషన్ బస్సులో జర్నీ ఉంటుంది. ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 9848540371 నెంబర్ కు కాల్ చేయవచ్చు. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లో వివరాలను చూడొచ్చు.

మరోవైపు సోమశిల ప్రకృతి అందాలను చూసి అస్వాదించాలనుకుంటున్నారా..? అయితే తక్కువ బడ్జెట్ లోనే రెండు రోజుల ప్యాకేజీని ప్రకటించింది.ప్రతి వీకెండ్ శనివారం తేదీల్లో ఈ ట్రిప్ అందుబాటులో ఉంటుంది.

సోమశిల టూరిజం ప్యాకేజీ వివరాలు:

  • హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు.
  • ప్రతి శనివారం తేదీల్లో అందుబాటులో ఉంటుంది.
  • రెండు రోజుల టూర్ ప్యాకేజీ ఇది.
  • నాన్ ఏసీ కోచ్ బస్సులో జర్నీ ఉంటుంది. ఉదయం 9 గంటలకు జర్నీ స్టార్ట్ అవుతుంది.
  • శ్రీశైలం చేరుకొని… రాత్రి అక్కడే బస చేస్తారు.
  • ఇక రెండో రోజు శ్రీశైలం నుంచి బయల్దేరి.. సోమశిల చేరుకుంటారు. ఇక్కడ క్రూజ్ బోట్ ద్వారా జర్నీ ఉంటుంది. బోట్ లో మీల్స్ ఇస్తారు.
  • సాయంత్రం 5 గంటలకు సోమశిల నుంచి హైదరాబాద్ కు బయల్దేరుతారు.
  • రాత్రి 9 గంటల వరకు హైదరాబాద్ చేరుకుంటారు.
WhatsApp channel

టాపిక్

Irctc PackagesIrctcAp TourismTourismTourist PlacesTravel
Source / Credits

Best Web Hosting Provider In India 2024