Gaami OTT release date: అఫీషియల్.. గామి ఓటీటీ రిలీజ్ అనౌన్స్ చేసేశారు.. ఎప్పుడు వస్తుందంటే?

Best Web Hosting Provider In India 2024

Gaami OTT release date: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఓ డిఫరెంట్ రోల్లో నటించిన గామి మూవీ మొత్తానికి ఓటీటీలోకి వచ్చేస్తోంది. మార్చి 8న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను బుధవారం (ఏప్రిల్ 3) అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ మూవీ జీ5 (ZEE5) ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.

గామి ఓటీటీ రిలీజ్ డేట్

ఎన్నో రోజులుగా అభిమానులు ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్ అధికారికంగా వచ్చేసింది. విశ్వక్ సేన్ నటించిన గామి మూవీ డిజిటల్ హక్కులను దక్కించుకున్న జీ5 ఓటీటీ ఈ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది. గామి మూవీ ఏప్రిల్ 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్, చాందినీ చౌదరి ఈ సినిమాలో లీడ్ రోల్స్ లో నటించారు.

విద్యాధర కాగిత డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. హాలీవుడ్ రేంజ్ లో ఈ మూవీని తీశారని, అద్భుతమైన విజువల్స్ తో ఆకట్టుకుందని ప్రేక్షకులు ఈ మూవీకి రివ్యూ ఇచ్చారు. నిజానికి ఈ సినిమా ఈ శుక్రవారమే (ఏప్రిల్ 5) ఓటీటీలోకి వస్తుందని భావించినా.. వారం ఆలస్యంగా ఏప్రిల్ 12న రాబోతోంది. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

“మీ సీట్‌బెల్ట్స్ వేసుకొని రెడీగా ఉండండి. గామి ప్రపంచంలోకి ప్రయాణాన్ని జీ5 ద్వారా కొనసాగించండి” అనే క్యాప్షన్ తో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆ ఓటీటీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక వీడియో ద్వారా డిజిటల్ ప్రీమియర్ డేట్ అనౌన్స్ చేశారు.

గామి మూవీ ఎలా ఉందంటే?

గామి మూవీలో విశ్వక్ సేన్ ఓ అఘోరా పాత్రలో కనిపించాడు. శంకర్ అనే అతని పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీకి మొదట్లో పాజిటివ్ రివ్యూలే వచ్చినా.. తర్వాత కావాలని కొందరు నెగటివ్ రివ్యూలు ఇచ్చినట్లు విశ్వక్ ఆరోపించాడు. మూవీ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయినందుకుగాను అతడు మీడియా, విమర్శకులు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతూనే.. ఇలా నెగటివ్ రివ్యూలు ఇస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాడు.

అడ్వెంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్‌గా ద‌ర్శ‌కుడు విద్యాధ‌ర్ గామి సినిమాను తెర‌కెక్కించాడు. మూడు క‌థ‌లను క‌లుపుతూ సాగే గ‌మ్మ‌త్తైన సినిమా ఇది. స్క్రీన్‌ప్లే, విజువ‌ల్స్, వీఎఫ్ఎక్స్‌తో మ్యాజిక్ చేయాల‌ని అనుకున్నాడు డైరెక్ట‌ర్‌. మూడు క‌థ‌ల‌ను క‌లుపుతూ వ‌చ్చే ట్విస్ట్ స‌ర్‌ప్రైజింగ్‌గా అనిపిస్తుంది.

శంక‌ర్‌, దుర్గ‌, మెడిక‌ల్ సెంట‌ర్‌లోచిక్కుకున్న కుర్రాడు ముగ్గురు జీవితాల్ని ప్యారాల‌ల్‌గా చూపిస్తూ చివ‌రి వ‌ర‌కు ఇంట్రెస్టింగ్‌గా సినిమా సాగుతుంది. స‌మ‌స్య‌ల వ‌ల‌యంలో చిక్కుకొని వారు ప‌డే సంఘ‌ర్షణ నుంచి చ‌క్క‌టి ఎమోష‌న్స్ రాబ‌ట్టుకున్నాడు డైరెక్ట‌ర్‌. హిమ‌లాయాల బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చే సీన్స్‌, సింహంతో యాక్ష‌న్ ఎపిసోడ్ హైలైట్ అనిపిస్తాయి.

శంక‌ర్ అనే అఘోరా పాత్ర‌లో విశ్వ‌క్‌సేన్ జీవించాడు. పాత్ర కోసం అత‌డు ప‌డిన క‌ష్టం స్క్రీన్‌పై క‌నిపిస్తుంది. అత‌డి లుక్‌, బాడీలాంగ్వేజ్ గ‌త సినిమాల‌కు పూర్తి భిన్నంగా క‌నిపిస్తుంది. అభిన‌య‌, అబ్దుల్ స‌మద్‌ల న‌ట‌న బాగుంది. చాందిని చౌద‌రి పాత్ర క‌థ‌కు సంబంధం లేన‌ట్లుగా అనిపిస్తుంది. యాక్టింగ్‌లో మాత్రం విశ్వ‌క్‌సేన్‌తో పోటీప‌డింది.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024