Best Web Hosting Provider In India 2024
AP TS Heat Wave : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు(Heat Wave) మండిపోతున్నాయి. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. పలు జిల్లాల్లో వడగాల్పులు వీస్తున్నాయని హెచ్చరికలు జారీ చేస్తుంది. చాలా ప్రాంతాల్లో ఎండలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. తెలంగాణలోని నిర్మల్ జిల్లా నర్సాపూర్ లో అత్యధికంగా 43.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఇక రాయలసీమలో తీవ్ర వడగాల్పులు (Ralayalaseema Heat Wave)వీస్తున్నాయి. సాధారణంగా కంటే ఎక్కువ ఉష్ణో్గ్రతలు రికార్డు అవుతుండడంతో ప్రజలు మధ్యాహ్న సమయంలో బయటకు రావొద్దని ఐఎండీ హెచ్చరించింది.
ట్రెండింగ్ వార్తలు
ఏపీలో తీవ్ర వడగాల్పులు
ప్రకాశం జిల్లా జువ్విగుంటలో 43.4°C అధిక ఉష్ణోగ్రతలు(Temperatures) నమోదైనట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. 43°Cకు పైగా ఉష్ణోగ్రతలు 11 జిల్లాల్లో నమోదైనట్లు తెలిపింది. అలాగే మంగళవారం 9 మండలాల్లో తీవ్రవడగాల్పులు(Heat Waves), 68 మండలాల్లో వడగాల్పులు వీచాయని తెలిపింది. ఇవాళ అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం(42.9) చింతూరు(42.7°C) మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మంగళవారం నెల్లూరు జిల్లా కలిగిరి, వైయస్సార్ జిల్లా వేడురూర్ లో 43.8°C, నంద్యాల జిల్లా మహానందిలో 43.7°C, కర్నూలు జిల్లా గూడూరులో 43.6°C రికార్డు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
మరో మూడ్రోజులు హీట్ వేవ్ పరిస్థితులు
ఏప్రిల్ 4 నుంచి 6వ తేదీ మధ్య జార్ఖండ్, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలలో హీట్ వేవ్ పరిస్థితులు(Heat Wave Conditions) ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఏప్రిల్ 03-06 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్(AP Temperatures), యానాం ప్రాంతాలలో వేడిగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఏప్రిల్ 03-06 తేదీల్లో దక్షిణ భారతదేశంంలో కొన్ని ప్రాంతాలలో వేడి గాలుల పరిస్థితులు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఏప్రిల్ 3-5 తేదీల మధ్య కర్ణాటకలోని హీట్ వెవ్ పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. ఈ నెల 4 నుంచి 6 తేదీల మధ్య జార్ఖండ్, తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, యానాంలో హీట్ వేవ్ పరిస్థితులు ఉన్నాయని తెలిపింది.
తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్
తెలంగాణలో(TS Heat Wave) సూర్యుడి ప్రతాపం తీవ్రంగా ఉంది. ఎండలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉక్కపోత, వేడిగాలులతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఏకంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఎండల తీవ్రతతో రాష్ట్రంలోని 15 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్(Orange Alert) జారీచేసింది. పలు జిల్లాల్లో యెల్లో అలర్ట్ జారీచేసింది. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా ఉండాయని తెలిపింది. నిర్మల్ జిల్లా వనల్‌పహాడ్, నర్సాపూర్ గ్రామాల్లో అత్యధికంగా 43.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డు అయ్యిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జగిత్యాల, నల్గొండ, ఖమ్మం, జోగులాంబ గద్వాల జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చెప్పారు.
సంబంధిత కథనం
టాపిక్